Begin typing your search above and press return to search.
మీ నుండి హీరోయిన్లు దూరంగా పారిపోతున్నారు!-గాయత్రి రఘురామ్
By: Tupaki Desk | 30 May 2021 7:30 AM GMTతమిళ నటి కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ సైలెంట్ గా బాంబ్ పేల్చారు. హీరో విశాల్ నుంచి కథానాయికలు దూరంగా పారిపోతున్నారని.. భయపడుతున్నారని ఫిర్యాదు చేశారు.
రియాలిటీ షో బిగ్ బాస్ తర్వాత తమిళ ప్రజలలో పాపులరైన కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ ఇప్పుడు బిజెపిలో చురుకైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ పై తన ట్విట్టర్ పేజీలో ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
పి.ఎస్.బి.బి పాఠశాల-చెన్నై లో విద్యార్థినిపై టీచర్ వేధింపుల అనంతరం స్కూల్ మూసేయాలంటూ విశాల్ చేసిన ప్రకటన వైరల్ అయిన తరువాత గాయత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ``సినీపరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపుల గురించి ముందు ఆలోచించండి. కొత్తగా ఈ రంగంలో ప్రవేశించే అమ్మాయిల విషయంలో ఏం జరుగుతుందో ముందు చూడండి. కథానాయికల విషయంలో మీరు మీ స్నేహితులు ఉపయోగించుకుని విసిరేందుకు ఒకే కొమ్మ(వేదిక) నుండి వచ్చారు. మీరు ప్రభావితం చేసిన చాలా మంది మహిళల పరిస్థితేంటి?`` అంటూ గాయత్రి సూటిగా వ్యాఖ్యానించారు.
మీ చలన చిత్ర పరిశ్రమ అమ్మాయిలకు మీ సహాయం అవసరమైనప్పుడు మీరు వీరత్వాన్ని చూపించి ఉండాలి. కానీ అది వేరే దారిలో... డీకేలు సువార్తికుల కారణంగా హిందూ బాషింగ్ ఉందని మీకు తెలుసా? మీ ఒరిజినాలిటీని తనిఖీ చేయండి. అక్షరాలా కథానాయికలు మీ నుండి దూరంగా పారిపోతున్నారు. మీరు దానిని తెలుసుకోవాలి. మీ నిరంతర విధానం కారణంగా నే ఇలా!! అంటూ గాయత్రి రఘురామ్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
`మా బాపు బొమ్మకు పెళ్లంట` (2003) చిత్రంతో తెలుగు వారికి గాయత్రి రఘురామ్ సుపరిచితం. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు కాబట్టి విశాల్ పై తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అయితే విశాల్ అభిమానులు మాత్రం దీనిని ఖండిస్తూ అతడికి మద్ధతుగా నిలుస్తున్నారు.