Begin typing your search above and press return to search.

జ‌య‌ల‌లిత‌ సినిమాలను అడ్డుకోవాల‌న్న‌ మేనకోడ‌లు .. తీర్పు చెప్పిన హైకోర్టు!

By:  Tupaki Desk   |   18 April 2021 12:38 PM GMT
జ‌య‌ల‌లిత‌ సినిమాలను అడ్డుకోవాల‌న్న‌ మేనకోడ‌లు .. తీర్పు చెప్పిన హైకోర్టు!
X
త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా ‘త‌లైవి’చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ‘క్వీన్‌’ పేరుతో ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. ఈ చిత్రాల‌ను నిలిపేయాల‌ని జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప‌, మేన‌ల్లుడు దీప‌క్ కోర్టు మెట్లు ఎక్కిన ‌సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాల్లో జ‌య జీవితం గురించి అస‌త్యాలు ఉన్నాయని, ప‌లు అంశాల ప‌ట్ల త‌మ‌కు అభ్యంత‌రం ఉంద‌ని కోర్టుకు విన్న‌వించారు. జ‌య‌ల‌లిత‌కు తామే వార‌సుల‌మ‌ని, త‌మ అనుమ‌తి లేకుండా రూపొందిస్తున్న సినిమాల‌ను అడ్డుకోవాల‌ని వీరు కోర్టును కోరారు.

మొద‌ట ఈ కేసును సింగిల్ బెంచ్ విచారించి, పిటిష‌న్ ను కొట్టేసింది. అయితే.. దీప అప్పీలుకు వెళ్ల‌డంతో.. హైకోర్టు బెంచ్ తాజాగా విచారించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌ద‌ర్శ‌కుల త‌ర‌పున లాయ‌ర్ వాద‌న‌లు వినిపించారు. ‘తలైవి’ అనే పుస్తకం ఆధారంగా సినిమా తెర‌కెక్కుతోంద‌ని కోర్టుకు వివ‌రించారు. అంతేకాకుండా.. అందులో ఎలాంటి వ్య‌తిరేక అంశాలు కూడా లేవ‌ని చెప్పారు.

అందువ‌ల్ల‌.. ఎవ‌రి అనుమ‌తులూ పొందాల్సిన అవ‌స‌రం లేద‌ని లాయ‌ర్ వాదించారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం.. దీప వాద‌న‌ల‌ను తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల‌నే ఖ‌రారు చేసింది. దీంతో.. సినిమాల‌కు న్యాయ‌ప‌ర‌మైన అడ్డంకులు తొల‌గిపోయాయి.