Begin typing your search above and press return to search.
ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోలు
By: Tupaki Desk | 29 Dec 2021 2:30 AM GMTటాలీవుడ్ సినిమా గురించి చెప్పాలంటే `బాహుబలి`కి ముందు `బాహుబలి` తరువాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే `బాహుబలి` తరువాత తెలుగు సినిమా మార్కెట్ తో పాటు స్థాయి కూడా పెరిగింది. బడ్జెట్ లు కూడా పెరిగాయి. దీంతో డిమాండ్ కూడా ఏర్పడింది. అందుకు తగ్గట్టే సిమాల నిర్మాణం, హీరోల పారితోషికాలు కూడా ఓ స్థాయిలో పెరిగి ఇండియాలోనే సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ నుంచి సినిమా అంటే యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టింది.
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విశేషం ఏంటంటే `బాహుబలి` తరువాత మన సినిమా స్థాయి, మార్కెట్ పెరిగిన నేపథ్యంలో మన హీరోల స్థాయి కూడా స్కై హైకి చేరిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఓ సర్వేలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఇద్దరు హీరోల గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ ఇద్దరు హీరోలు మన తెలుగు వారే కావడం విశేషం.
ప్రభాస్ కు `బాహుబలి`తో వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఏర్పడింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు లభించింది. దీంతో ప్రభాస్ కు భారీ డిమాండ్ మొదలైంది. ఆ డిమాండ్ మేరకు ప్రభాస్ ఒక్కో సినిమాకు దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ చిత్రాలకు గానూ ఇదే స్థాయిలో పారితోషికం అందుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ తరువాత ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలుస్తున్నారు. తను తాజాగా చేస్తున్నరెండు చిత్రాలకు గానూ రామ్ చరణ్ 200 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తాన్నిఆయన ఇప్పటికే సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతో ప్రభాస్ తరువాత ఈ స్థాయిలో పారితోషికం సొంతం చేసుకుంటున్న హీరోగా రామ్ చరణ్ రికార్డు సాధించాడం గమనార్హం.
అంతే కాకుండా దేశ వ్యాప్తంగా వున్న సినీ ఇండస్ట్రీలలో అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న ఇద్దరు హీరోలుగా మన తెలుగు హీరోలు ప్రభాస్, రామ్ చరణ్ ముందు వరుసలో నిలవడం విశేషంఆ చెప్పుకుంటున్నారు. ఇలా టాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం తో టాలీవుడ్ హీరోలు, మేకర్స్ ప్రౌడ్ గా ఫీలవుతున్నారట. ప్రభాస నటిస్తున్న మూడు భార పాన్ ఇండియా చిత్రాలు రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్.
ఈ మూడు చిత్రాల్లో `రాధేశ్యామ్` ఇప్పటికే పూర్తయి జనవరి 14న సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక మిగిలిన రెండు చిత్రాలు `ఆది పురుష్`, సలార్ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వున్నాయి. ఆది పురుష్ వచ్చే ఏడాది ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా విడుదల కానుందగా.. దీనికి ముందే అంటే ఏప్రిల్ 14న `సలార్` థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుండగా మైనింగ్ మాఫియా నేపథ్యలో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.