Begin typing your search above and press return to search.
'శ్రీదేవి సోడా సెంటర్' కి హైలైట్ గా నిలిచిన క్లైమాక్స్..!
By: Tupaki Desk | 28 Aug 2021 2:30 AM GMT'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు - ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ''శ్రీదేవి సోడా సెంటర్''. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఓ సోడా సెంటర్ యజమాని కూతురిని ఓ ఎలక్ట్రీషియన్ ప్రేమించడం.. వేర్వేరు కులాలకు చెందిన వీరి ప్రేమకు ఊహించని అడ్డంకులు ఎదురు కావడం.. గ్రామాల్లోని సాంఘిక, ఆర్థిక, సామాజిక ఇబ్బందుల వల్ల వీరి ప్రేమ కథ సఫలం అవుతుందా లేదా అనేది ఈ సినిమా కథాంశం.
సమాజంలో అంతరాల్ని, కుల వివక్షని తెరపై చూపించడం అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 'పలాస' చిత్రంలో శ్రీకాకుళం నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టోరీని చెప్పి సక్సెస్ అయిన కరుణ కుమార్.. ''శ్రీదేవి సోడా సెంటర్'' చిత్రంలో గోదావరి జిల్లాలోని సామాజిక, ఆర్థిక కోణాల్ని, ఆ నేపథ్యంలో భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. ఇంటెన్స్ ఎమోషనల్ స్టోరీకి తగ్గట్టుగా నటీనటులు కూడా అద్భుత నటన కనబరిచారని ప్రేక్షకులు చెబుతున్నారు. లైటింగ్ సూరిబాబుగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన సుధీర్ బాబుతో పాటుగా మిగతా లీడ్ క్యాస్టింగ్ బాగా యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రంలోని చివరి అరగంట సినిమా గురించి.. పతాక సన్నివేశాల గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ లో సుధీర్ బాబు కొడవలి పట్టుకొని నరేష్ ముందు కూర్చుని మాట్లాడే సీన్ హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్లైమాక్స్ తో వచ్చిన తెలుగు సినిమా అని.. ఇదే సినిమాని నిలబెట్టిందనే కామెంట్స్ వస్తున్నాయి. క్లైమాక్స్ లో రియలిస్టిక్ ఎమోషన్స్ ని పండించిన సుధీర్.. తన యాక్టింగ్ తో కెరీర్ లో ఇంకో మెట్టు ఎక్కాడని చెబుతున్నారు. హీరోయిన్ ఆనంది ఎప్పటిలాగే సహజత్వంతో నటించగా.. సీనియర్ నరేష్ ఎమోషన్స్ తో కూడిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. థియేటర్లలో మొదటి ఆట నుంచే మంచి రెస్పాన్స్ తో నడుస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' సౌండింగ్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.