Begin typing your search above and press return to search.

ఏంటీ.. మహేష్ ప్లాప్ మూవీ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిందా...!

By:  Tupaki Desk   |   5 Sept 2020 3:45 AM
ఏంటీ.. మహేష్ ప్లాప్ మూవీ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిందా...!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో దారుణమైన పరాజయం చవిచూసిన సినిమాల్లో ''ఆగడు'' ఒకటని చెప్పవచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు. అంతకముందు మహేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందించిన 'దూకుడు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో 'ఆగడు' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే మూవీ సాంగ్స్ మరియు ట్రైలర్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే తీరా థియేటర్స్ కి వచ్చాక 'ఆగడు' కొన్ని రోజులు కూడా ఆగకుండానే వెళ్లిపోయింది. అయితే అంతటి ప్లాప్ ని మూటగట్టుకున్న 'ఆగడు' మూవీ ఇప్పుడు సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

కాగా 'ఆగడు' హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకుంది. హిందీ డబ్బింగ్ లో విడుదల చేయబడ్డ అన్ని వెర్షన్స్ వ్యూస్ కలిపితే ఈ చిత్రానికి 500 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇండియన్ సినిమాలో ఈ మార్క్ అందుకున్న మొదటి సినిమాగా 'ఆగడు' నిలిచింది. బ్లాక్ బస్టర్ మూవీస్ రికార్డ్స్ క్రియేట్ చేయడంలో విశేషం లేదు.. కానీ ఒక ప్లాప్ సినిమా ఇలాంటి భారీ రికార్డ్ క్రియేట్ చేయడం గొప్ప అనే చెప్పాలి. అయితే మహేష్ బాబు కి నేషనల్ వైడ్ ఉన్న క్రేజ్ ఈ చిత్రానికి అన్ని మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసిందని తెలుస్తోంది. అందులోనూ 'ఆగడు' సినిమా ఫెయిల్ అయినప్పటికీ మహేష్ మేనరిజం.. డైలాగ్ డెలివరీ.. యాక్షన్ సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. యాక్షన్ సినిమాలను విపరీతంగా ఆదరించే నార్త్ ఆడియన్స్ 'ఆగడు' కి ఈ రికార్డ్ ని కట్టబెట్టాయి.