Begin typing your search above and press return to search.

అనుష్క‌ని ఇండస్ట్రీ మ‌ర్చిపోయింది!

By:  Tupaki Desk   |   4 Nov 2022 1:30 PM GMT
అనుష్క‌ని ఇండస్ట్రీ మ‌ర్చిపోయింది!
X
స్వీటీ అనుష్క తెర‌పై క‌నిపించి రెండేళ్లు అవుతుంది. `సైలెన్స్` త‌ర్వాత అమ్మ‌డు ఇండ‌స్ర్టీకి పూర్తిగా క‌నుమ‌రుగైపోయింది. కోవిడ్ రాక‌తో క‌నిపించ‌లేదు అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే! ఎందుకంటే క‌రోనా పోయి నెల‌లు గ‌డుస్తుంది. జ‌న జీవ‌న‌మంతా య‌ధావిధిగా సాగుతోంది. అంతా క‌రోనా భ‌యం నుంచి పూర్తిగా కోలుకుని జీవ‌నం సాగిస్తున్నారు. కానీ అనుష్క జాడ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల సందేహాలు తెరపైకి వ‌చ్చాయి. అవ‌కాశాలు రాక న‌టించ‌లేదా? అవ‌కాశం ఉండి న‌టించ‌లేదా? అస‌లు అనుష్క విషయంలో ఏం జ‌రుగుతోంది? అంటూ విశ్లేష‌కులు కాస్త లోతుగానే అన్వేషించారు. మ‌ధ్య‌లో అమ్మ‌డి పెళ్లి ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. మూడు మూళ్లు వేయించుకుని ఏడు అడు గులు వేసి అత్తారింటికెళ్లి ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అవ్వాల‌నే ఇలా దూరంగా ఉంటుందా? అని గ‌ట్టిగానే వినిపించింది.

కానీ ఇంత వ‌ర‌కూ అదీ జ‌ర‌గ‌లేదు. ఇత‌ర భాష‌ల్లోనూ సినిమాలు చేస్తున్న‌ట్లు క‌నిపించ‌లేదు. తెలుగులోనే ఆ మధ్య‌ న‌వీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఆ సినిమా అప్ డేట్ కూడా లేదు. మ‌రి మొత్తంగా అనుష్క తాజా ప‌రిస్థితిని చూసిన వాళ్లు మాత్రం టాలీవుడ్ కి ఆమె దూర‌మైంద‌నే మెజార్టీ వ‌ర్గం భావిస్తోంది.

ఎలాంటి అలికిడి లేక‌పోవ‌డంతో అనుష్క‌ని తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ర్చిపోతుందంటూ ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా చ‌ర్చ సైతం సాగుతోంది. అనుష్క‌కి అవ‌కాశాలు రాకే ఆమె దూరంగా ఉంటుంద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వాలు తెలియాల్సి ఉంది. ఇక అనుష్క సినిమాల‌పై ఆస‌క్తితో ముఖానికి మేక‌ప్ వేసుకోలేదు.

రంగు వేసుకోవ‌డం అన్న‌ది అనుకోకుండా జ‌రిగింది. స్టార్ హీరోయిన్ అవ్వ‌డం అలాగే జ‌రిగిపోయింది. యోగా టీచ‌ర్ గా ఉన్న అనుష్క బ్యూటీని మెచ్చి హీరోయిన్ చేయాల‌ని హైద‌రాబాద్ తీసుకొచ్చి అంత పెద్ద స్టార్ ని చేసాడు. ఆ ర‌కంగా ఇండ‌స్ర్టీలో ఓ వెలుగు వెలిగింది. కానీ ఒక్క‌సారిగా ఇలా ఎవ‌రికి క‌న‌బ‌డ‌కుండా ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. మ‌రి అమ్మ‌డు స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేస్తుందా? అన్న‌ది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.