Begin typing your search above and press return to search.

అక్కినేని అన్నదమ్ముల్ని ఇండస్ట్రీ మర్చిపోలేదట

By:  Tupaki Desk   |   20 Oct 2021 3:59 AM GMT
అక్కినేని అన్నదమ్ముల్ని ఇండస్ట్రీ మర్చిపోలేదట
X
మనసులో ఉన్న విషయాన్ని మొత్తంగా చెప్పేయటం అందరికి సాధ్యం కాదు. అది మంచి అయినా చెడు అయినా చెప్పేందుకు వెనుకాడని తత్త్వం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం. కరోనా వేళలో.. సినిమా థియేటర్ కు ప్రేక్షకులు వస్తారా? అన్న భయాందోళనతో ఇండస్ట్రీ మొత్తం ఉన్న వేళ.. తమ వరుస సినిమాలతో సినీ పరిశ్రమకు సరికొత్త ఉత్సాహాన్ని.. ధైర్యాన్ని ఇవ్వటంలో అక్కినేని అన్నదమ్ములు నిలిచారన్న బన్నీ మాట ఆసక్తికరంగా మారింది.

నిజమే.. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న సినిమాలు ఉన్నాయి. కానీ.. ఎవరికి వారు మరికాస్త వెయిట్ చేద్దామని ఎదురుచూస్తున్న వారే కానీ.. తమ సినిమాల్ని థియేటర్లలో విడుదల చేయటానికి సిద్దంగా లేని పరిస్థితి. ఇలాంటివేళ.. అక్కినేని కుటుంబానికి చెందిన నాగ చైతన్య.. అఖిల్ ఇద్దరి సినిమాలు రెండు వారాల వ్యవధిలో విడుదల కావటం ఒక ఎత్తు.. రెండు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవటం మరో ఎత్తు.

సినిమాను చూడటానికి థియేటర్ కు ప్రేక్షకుడు వస్తాడన్న నమ్మకాన్ని.. ధైర్యాన్ని కలిగించటంలో వీరిద్దరి సినిమాలు సాయం చేశాయి. ఇదే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ మూవీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు.. వారి కుటుంబాలు ఉన్నప్పటికీ.. రిస్కును ఫేస్ చేసే విషయంలో మాత్రం అక్కినేని అన్నదమ్ములు ఇద్దరు ఒక అడుగు ముందుకు వేయటం ఒక ఎత్తు.. ఇలా సాటి హీరో చేత మాత్రమే కాదు అందరి చేత పొగడ్తలు కురిపించుకున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.