Begin typing your search above and press return to search.
25 ఏళ్ల సూర్య ప్రయాణం ఓ అద్భుతం!
By: Tupaki Desk | 6 Sep 2022 4:30 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు..తమిళ భాషల్లో సూర్య అంటే ఓ బ్రాండ్. తమిళ నటుటైనా టాలీవుడ్ అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు. ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. వెండి తెరపై ఆయన చేయని ప్రయోగంటూ ఉండదు. కమర్శియల్ చిత్రాలతో వైవిథ్యమైన చిత్రాలతోనూ మెప్పించడం సూర్య ప్రత్యేకత.
ఇటీవలే విక్రమ్ లో ఐదు నిమిషాల రోలెక్స్ పాత్రతో పాన్ ఇండియాలో ఫేమస్ అయిపోయారు. విశ్వ నటుడు కమల్ హాసన్ సూర్య ప్రతిభను మెచ్చుతూ చేసిన వీడియో అతని స్థాయిని మరింత పెంచింది. జాతీయ ఉత్తమ నటుడిగాను అవార్డులు..రివార్డులు అందుకున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సూర్య కెరీర్ లో 2022 లో చేసుకున్నాయి. అంతేనా నటుడిగా సూర్య ప్రయాణానికి ఇదే ఏడాదితో పాతికేళ్లు నిండింది. ఈ సందర్భంగా సూర్య ట్విటర్లో ఓ ఆసక్తికర పోస్ట్ తో సంతోషాన్ని పంచుకున్నారు.
"నిజంగా 25 సంవత్సరాలు అందమైన జర్నీ అద్భుతం మరియు ఆశీర్వాదం..! కలలు కనండి మరియు నమ్మండి..! మీ సూర్య" అని రాస్తూ తన అభిమానులకు ధన్యవాదాలు" తెలిపారు. రెండు దశాబ్దాల కెరీర్‌లో సూర్య అనేక మరపురాని హిట్‌లను అందించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు.
సూర్య తండ్రి శివకుమార్ వారసత్వంతో కోలీవుడ్ లో లాంచ్ అయ్యారు. 1997లో మణిరత్నం ప్రొడక్షన్‌లో'నెరుక్కు నెర్'తో తన అరంగేట్రం చేసారు. ఇప్పటివరకూ దాదాపు 50 చిత్రాల్లో నటించారు. ఇంతింతై వటుడింతై చందగా పరిశ్రమలో ఎదిగారు. ఒక్కో సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ బాక్సాపీస్ వద్ద సత్తా చాటారు. లవర్ బాయ్ అయినా.. ఆర్మీ ఆఫీసర్ అయినా.. మాస్ హీరో అయినా... కామన్ మ్యాన్ రోల్ అయినా ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు.
సూర్య ఇప్పటివరకూ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు.. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్.. మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు సహా అనేక అవార్డులను అందుకున్నారు. దక్షిణాది నుండి ఆస్కార్‌కు చేరుకున్న ఏకైక నటుడు కూడా. సూర్య చివరి రెండు చిత్రాలు 'జై భీమ్' .. 'సూరరై పొట్రు' ఆస్కార్ అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడ్డాయి.
కానీ ఫైనల్‌కు చేరుకోలేకపోయాయి. ఆరకంగా ఆస్కార్ కమిటీకి ఆహ్వానించబడిన మొదటి దక్షిణ భారత నటుడు సూర్య కి పేరుంది. ప్రస్తుతం సూర్య చేతిలో పలు ప్రాజెక్ట్ లున్నాయి. స్టార్ హీరోల చిత్రాల్లో సైతం కీలక పాత్రల్లో నటిస్తూ నిరాడంబరతను చాటుకుంటున్నారు. కోలీవుడ్ లో సూర్య జనరేషన్ హీరోల్లో ఇలా రాణించడం సూర్యకి మాత్రమే చెల్లింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.