Begin typing your search above and press return to search.
జంగిల్ బుక్.. వాట్ ఎ జర్నీ
By: Tupaki Desk | 27 May 2016 7:05 AM GMTఅప్పట్లో ‘టైటానిక్’ సినిమా ఇండియాలో పాతిక కోట్ల వసూళ్లను సాధిస్తే ఆశ్చర్యపోయాం. తర్వాత ‘అవతార్’ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే ఔరా అనుకున్నాం. ఇక గత ఏడాది ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ తొలిసారి వంద కోట్లు వసూలు చేసిన హాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించింది. వీటిలో ఒక రికార్డుకు ఇంకో రికార్డుకు మధ్య చాలా ఏళ్ల గ్యాప్ వచ్చింది.
కానీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ మూవీ వంద కోట్ల మార్కు దాటిన ఏడాదికే ‘జంగిల్’ బుక్ దాని మీద 150 శాతం అధిక వసూళ్లతో సరికొత్త రికార్డు నెలకొల్పడం అబ్బుర పరిచే విషయమే. తొలి నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో వీకెండ్ అయ్యేసరికే వంద కోట్లు.. మూడు వారాలకే రూ.200 కోట్లు.. ఆరు వారాలకు రూ.250 కోట్లు వసూలు చేసి ఇండియన్ ట్రేండ్ పండిట్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్ నిర్మాతలకు దిమ్మదిరిగిపోయేలా చేసింది. ఈ సినిమా దెబ్బకు షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమా ‘ఫ్యాన్’ కూడా కుదేలైంది.
ఇప్పుడీ సినిమా మరో ఘనత అందుకుంది. 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఇంకా చెప్పుకోదగ్గ సెంటర్లలో ఆడుతోంది. దేశంలోని ప్రతి ప్రముఖ నగరంలోనూ ఈ సినిమా ఆడుతోంది. దేశవ్యాప్తంగా కనీసం వంద స్క్రీన్లలో అయినా ఈ సినిమా ఆడుతూ ఉండొచ్చని అంచనా. ఎందుకంటే ప్రతి మెట్రో సిటీలోని ప్రతి మల్టీప్లెక్స్ లోనూ ‘జంగిల్ బుక్’ షోలు పడుతున్నాయి. 7వ వారంలో సైతం ఈ సినిమా రూ.2.7 కోట్లు వసూలు చేయడం విశేషం.