Begin typing your search above and press return to search.
ద కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి సంచలన సవాల్.. స్వీకరించే దమ్ము ఎవరిది?
By: Tupaki Desk | 30 Nov 2022 4:24 AM GMTసంచలన విజయంతో పాటు.. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర తీసిన చిత్రం ద కశ్మీర్ ఫైల్స్. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని సాధించటంతో పాటు..చరిత్రలో అత్యంత దారుణమైన ఒక విషాద ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించటమే కాదు.. అప్పట్లో కశ్మీర్ పండిట్లకు జరిగిన అన్యాయం.. వారి విషయంలో రాజకీయ పక్షాలు అనుసరించిన వైఖరిని కళ్లకు కట్టినట్లుగా చూపించిన వైనానికి యావత్ దేశమే కదిలిపోవటం తెలిసిందే. ఈ మూవీ నేపథ్యంలో అప్పట్లో జరిగిన మారణకాండ గురించి కొందరు తప్పుడు ప్రచారంగా చెప్పుకొస్తే.. అత్యధికులు మాత్రం నాడు కశ్మీర్ లో చోటు చేసుకున్న మారణహోమాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారన్న మాట వినిపించింది.
ఇదిలా ఉండగా గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం పొట్టిగా చెప్పాలంటే ఇఫీలో ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తానీ సినిమాను చూసి షాక్ తిన్నానని.. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకరమైన సినిమాగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఇఫీ లాంటి వేదిక మీద ఈ మూవీనిఎలా ప్రదర్శిస్తారని ప్రశ్నించారు. ఇతగాడి వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.
ఈ నేపథ్యంలో ద కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎమోషనల్ అయ్యారు. సంచలన సవాల్ విసిరారు. తాను తీసిన సినిమాలో ఒక్క డైలాగ్ కానీ ఒక సన్నివేశం కానీ అబద్ధమని ఎవరు నిరూపించినా తాను చిత్ర పరిశ్రమను వదిలేసి వెళ్లిపోతానని స్పష్టం చేయటం గమనార్హం. అంతేకాదు.. దేశాన్ని ముక్కలు చేయాలని తుక్డే గ్యాంగ్.. అర్బన్ నక్సల్స్ కానీ ఉగ్రవాదులు కానీ కశ్మీర్ ఫైల్స్ అబద్ధమని నిరూపించాలన్నారు.
నిజం చాలా ప్రమాదకరమైనదని.. నిజం అనేది ప్రజలను అబద్ధాలు చెప్పేలా చేస్తుందని..కశ్మీర్ ఫైల్స్ చిత్రం నిజమని.. కల్పితం కాదని.. కశ్మీరీ పండిట్ల మీద జరిగిన అత్యాచారాలు.. ఊచకోతలు.. వారిని బలవంతంగా కశ్మీర్ నుంచి వెళ్లగొట్టిన పన్నాగం అంతా నిజమన్నారు.
కశ్మీర్ ను విడిచిపెట్టిన 700 మంది బాధితులతో మాట్లాడిన తర్వాతే తానీ కథను రూపొందించినట్లుగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దర్శకుడు చెప్పినట్లుగా ఇవన్నీకల్పితాలు కావన్నారు. ఈ దారుణాలకు పాల్పడిన యాసిన్ మాలిక్ జైల్లో ఉన్నాడని..ఒకవేళ కశ్మీర్ ఫైల్స్ అబద్ధమైతే.. తాను చేసిన నేరాన్ని అతను ఎలా ఒప్పుకున్నాడని ప్రశ్నించారు.
ఇజ్రాయెల్ దర్శకుడు లాపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇఫీ జ్యురీ బోర్డు స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ సైతం తప్పు పట్టారు. ఇక.. దర్శకుడు లాపిడ్ వ్యాఖ్యలపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి స్పందించారు. తమ దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు కోరారు. లాపిడ్ చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో ఖండిస్తూ పోస్టు చేశారు. తెలిసి తెలియనితనం.. తాము మాత్రమే మేధావులమని భావించే కొందరు ప్రముఖుల తీరుకు నిదర్శకంగా లాపిడ్ ను చెప్పాలి. ఆయన్నే కాదు.. ఈ చిత్రాన్ని తప్పుగా అభివర్ణించే వారిని బలంగా నిలదీయాల్సిన అవసరం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.