Begin typing your search above and press return to search.
కశ్మీర్ ఫైల్స్ కి లెజండరీ రైటర్ సపోర్ట్
By: Tupaki Desk | 3 March 2022 1:30 PM GMT`ది తాష్కెంట్ ఫైల్స్` ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి మరో సంచలన ప్రయత్నం `ది కశ్మీర్ ఫైల్స్`. 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సమూహిక మారకాండ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషీ, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివాదాస్పద కథాంశంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
జీ స్టూడియోస్, అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ బ్యానర్ పై తేజ్ నారాయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషీ నిర్మించారు. 1990 కాలంలో కశ్మీర్ పండిట్ లపై దారుణ మారణ కాండ జరిగింది. దీనిపై సంచలన కథనంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సంచలన చిత్రాన్నితెరపైకి తీసుకొచ్చారు. ఆ మధ్ ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది.
అంతే కాకుండా ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించడం విశేషం. ఇదిలా వుంటే ఈ చిత్రానికి లెజెండరీ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సపోర్ట్ గా నిలిచారని చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమా 11న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జర్నీ ఆఫ్ `ది కశ్మీర్ ఫైల్స్` పేరుతో ప్రత్యేకంగా ఓ వీడియోని విడుదల చేసింది.
లెజండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో ఈ సినిమాపై ప్రత్యేకంగా చర్చించామని, ఆయన తన అమూల్యమైన ఇన్ పుట్స్ ని అందించారని, ఆయనతో కలిసి గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేమని చిత్ర బృందం తెలిపింది.
దాదాపు 32 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్ ల పై జరిగిన నరమోధానికి సాక్ష్యంగా ఈ సినిమా నిలుస్తుందని, ఇందు కోసం చిత్ర బృందం ఎన్నో వ్యవ ప్రయాసల కోర్చి ఆనాటి యదార్ధ సంఘటనలని తెరపైకి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రోహిత్ శర్మ నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు స్వప్నిల్ బందోకర్ స్వరాలు అందించారు.