Begin typing your search above and press return to search.

'ది క‌శ్మీర్ ఫైల్స్' కు విదేశీ గ‌డ్డ‌పై అరుదైన గౌర‌వం

By:  Tupaki Desk   |   14 March 2022 1:30 PM GMT
ది క‌శ్మీర్ ఫైల్స్ కు విదేశీ గ‌డ్డ‌పై అరుదైన గౌర‌వం
X
కశ్మీర్ పండిట్ల న‌ర‌మేధం నేప‌థ్యంలో రూపొందిన చిత్రం `ది క‌శ్మీర్ ఫైల్స్‌`. వివేక్ అగ్నిహోత్రి రంజ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఎన్నో వ్య‌వ ప్ర‌యాస‌ల కోర్చి ఈ చిత్రాన్ని చిత్ర బృందం తెర‌పైకి తీసుకొచ్చింది. 1990లో క‌శ్మీర్ లో ఓ సామాజిక వర్గంపై జ‌రిగిన దారుణ మార‌ణ కాండ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. సున్నిత‌మైన భావోద్వేగాల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మార్చి 11న ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం అనేక ఒత్తిడుల మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది.

బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టిస్తూ ప్ర‌తీ ఒక్క‌రి చేత కంట‌త‌డి పెట్టిస్తోంది. స‌మ‌స్యాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అనుప‌మ్ ఖేర్‌, ప‌ల్ల‌వి జోషి, ద‌ర్శన్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జీ స్టూడియోస్ బ్యాన‌ర్‌ పై ప‌ల్ల‌వి జోషి, అభిషేక్ అగ‌ర్వాల్‌, తేజ్ నారాయ‌ణ్ అగ‌ర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనేక స‌వాళ్ల‌ని అధిగ‌మించిన ఈ చిత్రం మొత్తానికి మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఈ చిత్రం గురించి తెలుసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చిత్ర బృందాన్ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించి అభినందిచ‌డం విశేషం. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఈ చిత్రంలో పుష్క‌ర‌నాథ్ గా మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, కృష్ణ పండిట్ గా ద‌ర్శ‌న్ కుమార్‌, రాధికా మీన‌న్ గా ప‌ల్ల‌వి జోషీ, శ్ర‌ద్ధా పండిట్ గా భాషా సుంబాలి, ఫ‌రూక్ మాలిక్ అకా బిట్టా గా చిన్మ‌య్ మాండ్లేక‌ర్ న‌టించారు. తాజాగా ఈ చిత్రానికి మ‌రో గౌర‌వం ద‌క్కింది.

32 సంవ‌త్స‌రాల లో మొట్ట‌మొద‌టి సారిగా యుఎస్ ఏ లోని అత్యంత ప్ర‌జాస్వామిక ఉద‌రావాద రాష్ట్ర‌మైన రోడ్ ఐలాండ్ `ది క‌శ్మీర్ ఫైల్స్` చిత్రాన్ని గుర్తించింది. ఈ మూవీ ద్వారా ఇచ్చిన సందేశాన్ని అధికారికంగా గుర్తిస్తూ ఓ స‌ర్టిఫికెట్ ని ద‌ర్శ‌కుడి పేరుతో అందించింది.

ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన చిత్ర బృందం ద‌య‌చేసి ఈ రోడ్ ఐలాండ్ గుర్తించి ఇచ్చిన స‌ర్టిఫికెట్ ని చూడండి. అందులో వున్న విష‌యాల్ని బ‌ట్టి ఎవ‌రు ఎవ‌రిని వేధించారో.. ఎవ‌రికి శిక్ష విధించాలో నిర్ణ‌యించుకోండి. కొత్త నాయ‌క‌త్వం, మాన‌వ‌తా వాదం చుట్టూ కేంద్రీకృత‌మై ఉన్న ప్ర‌భావవంత‌మైన విదేశీ విధానాల‌కు ధ‌న్య‌వాదాలు. ఇది న్యూ ఇండియా` అంటూ వెల్ల‌డించింది.