Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో 'ది కశ్మీర్ ఫైల్స్' సంచలనం
By: Tupaki Desk | 18 March 2022 2:30 AM GMTఈమద్య కాలంలో ఏ సినిమాకు రాని పాజిటివ్ రివ్యూలు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు వచ్చాయి. యూనానిమస్ గా 5 కి 5 రేటింగ్ ను ఇచ్చి మరీ జనాలు భారీ ఎత్తున సినిమాను ఆధరిస్తున్నారు. మొదటి రోజు చాలా సింపుల్ గా ఒక చిన్న సినిమాగా విడుదల అయిన ఈ సినిమా సత్తా ఏంటీ అనేది రెండవ రోజు నుండి తెలిసింది. మొదటి రోజును మించి రెండవ రోజు.. రెండవ రోజు నుండి మూడవ రోజు. మూడవ రోజు ను మించి నాల్గవ రోజు ఇలా రోజులు గడుస్తున్నా కొద్ది వసూళ్లు పెరుగుతూనే వస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు ఇప్పటికే వంద కోట్ల వరకు చేరాయి అంటూ ట్రేడ్ వర్గాల టాక్ వినిపిస్తుంది. రాధేశ్యామ్ వంటి మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమాను వెనక్కు నెట్టి మరీ ఈ సినిమా దేశ వ్యాప్తంగా రచ్చ చేస్తోంది. హిందీ వర్షన్ అయినా కూడా సౌత్ లో దుమ్ము దులుపుతోంది. సాదారణంగా అయితే హిందీ సినిమాలకు సౌత్ లో చాలా తక్కువ షో లు పడుతూ ఉంటాయి. కాని ఈ సినిమా కు మల్టీ ప్లెక్స్ లతో పాటు సింగిల్ స్క్రీన్ ల్లో కూడా భారీగా షో లు పడుతున్నాయి.
సినిమా విడుదల అయ్యి వారం దాటుతున్నా కూడా జోరు మాత్రం తగ్గడం లేదు. ఒక్క హైదరాబాద్ లోనే నిన్న ఈ సినిమా 230 షో లు పడ్డట్లుగా తెలుస్తోంది. బచ్చన్ పాండే వంటి సూపర్ హిట్ సినిమా ను కూడా హైదరాబాద్ లో పెద్దగా చూడటం లేదు. నిన్న హైదరాబాద్ లో బచ్చన్ పాండేకు కేవలం 150 షో లు పడ్డాయి. కాని ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కు 230 షో లు పడటం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ సినిమా వీకెండ్స్ లో 300 నుండి 350 షో ల వరకు కూడా స్క్రీనింగ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి భారీ ఎత్తున ఈ సినిమాకు వసూళ్లు వస్తున్న నేపథ్యంలో మరిన్ని షో లను కూడా నైజాం ఏరియాలో పెంచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఈ వీకెండ్ లో ఈ సినిమా సాధించబోతున్న వసూళ్లు ఊహకు అందడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి.