Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ డే రోజున రిలీజ్ అవుతున్న 'ది కాశ్మీర్ ఫైల్స్'..!

By:  Tupaki Desk   |   19 Nov 2021 11:35 AM GMT
రిపబ్లిక్ డే రోజున రిలీజ్ అవుతున్న ది కాశ్మీర్ ఫైల్స్..!
X
వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం గురించి 'తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ చిత్రానికి గానూ ఉత్తమ స్క్రీన్ ప్లే మరియు సంభాషణల విభాగాల్లో నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఈ క్రమంలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాశ్మీర్ మారణహోమం వాస్తవ కథ ఆధారంగా ''ది కాశ్మీర్ ఫైల్స్'' సినిమా రూపొందింది. జీ స్టూడియోస్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి - అనుపమ్ ఖేర్ మరియు పల్లవి జోషి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. పునీత్ ఇస్సార్ - అర్పణ్ భిఖారి మరియు భాషా సంబ్లి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

భారతదేశంలో మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాలలో ఒకటైన 'ది కాశ్మీర్ ఫైల్స్' విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా 2022 జనవరి 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా వదిలలైన4పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఆరెంజ్ కలర్ లో కాశ్మీర్ మ్యాప్ ను కలిగి ఉన్న ఈ పోస్టర్ పై 'న్యాయ హక్కు' అని వ్రాయబడివుంది. బ్యాగ్రౌండ్ లో 370 అనే నంబర్ ని గమనించవచ్చు.

ఆర్టికల్ 370 చుట్టూ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పీరియాడిక్ డ్రామాగా "కాశ్మీర్ ఫైల్స్" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్టికల్ 370 చట్టాన్ని తీసుకురావడానికి మరియు ఇటీవల తొలగించడానికి గల కారణాలను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాశ్మీర్ లోయ చరిత్రలోని వాస్తవ సంఘటనలు తెలియజెప్పడానికి గణతంత్ర దినోత్సవం సరైన సమయమని మేకర్స్ భావిస్తున్నారు.

ఇకపోతే 'ది కాశ్మీర్ ఫైల్స్' తర్వాత 'ది ఢిల్లీ ఫైల్స్' అనే మరో వైవిధ్యమైన చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి శ్రీకారం చుట్టారు. ఇందులో జీవించే హక్కు గురించి చెప్పబోతున్నాను. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ - ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. అభిషేక్‌ అగర్వాల్‌ - అర్చన అగర్వాల్.. వివేక్ అగ్నిహోత్రి - పల్లవి జోషి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.