Begin typing your search above and press return to search.

సినిమా కోసం కోట్లు ఖర్చు చేయకుండా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది...!

By:  Tupaki Desk   |   6 Sep 2020 12:30 AM GMT
సినిమా కోసం కోట్లు ఖర్చు చేయకుండా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది...!
X
సౌత్ ఇండస్ట్రీలో విల‌క్ష‌ణ నటుడిగా గుర్తింపు పొందిన మలయాళ నేచురల్ స్టార్ ఫాహ‌ద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ ''సీ యూ సూన్''. కోట్ల‌కి కోట్లు పెట్టుబ‌డి పెట్టి సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్ తో కొద్దిమంది నటీనటులతో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకొని ఈ సినిమా తెరకెక్కించారు. ఫాహద్‌ - రోషన్‌ మాథ్యూస్ - దర్శనా రాజేంద్రన్‌ ప్రధాన పాత్రల్లో మహేష్ సి. నారాయణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుద‌లై మంచి ఆదరణ దక్కించుకుంటోంది. 'సీ యూ సూన్' సినిమా లాక్ డౌన్ టైమ్ లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ టైపులో పూర్తిగా ఐ ఫోన్‌ లో చిత్రీకరించడం విశేషం. 70 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాకు 25 ల‌క్ష‌ల‌ లోపే ఖర్చు పెట్టారని టాక్. అయితే అమెజాన్ ప్రైమ్ కి వారికి ఈ చిత్రాన్ని 2 కోట్ల‌కి అమ్మారని తెలుస్తోంది. మన తెలుగు ఫిల్మ్ మేక‌ర్స్ కూడా ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఓటీటీ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

కాగా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఆదరణ పొందుతుంటాయి. అందుకే భాష అర్థం కాక‌పోయినా తెలుగు ఆడియెన్స్ ఈ మధ్య వెతికి మ‌రీ మలయాళ సినిమాలు చూస్తున్నారు. మలయాళం లో త్వరలోనే ఏ సినిమా రిలీజ్ కాబోతోందంటూ సెర్చ్ చేస్తున్నారు. సినిమా బాగుందని టాక్ వస్తే వెంటనే తెలుగు దర్శకనిర్మాతలు పోటీపడి మరి రీమేక్ రైట్స్ తీసుకుంటున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినిమా బాగుంద‌ని వేరే భాష ఆడియెన్స్ మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీస్ అంటూ భారీ బడ్జెట్ మూవీస్ ప్లాన్ చేసి ఇతర భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కానీ.. తెలుగులో మాత్రమే రిలీజైన సినిమాల గురించి పక్క ఇండస్ట్రీల వారు మాట్లాడుకునే రేంజ్ సినిమాలు రాలేదు. ఈ కరోనా క్రైసిస్ లో పాన్ ఇండియా సినిమాలే కాకుండా మలయాళ సినిమాల స్పూర్తితో తక్కువ బడ్జెట్ లో తీసే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు.