Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఏ గాలీ ఎవరిని ఎటు తీసుకెళుతుందో!
By: Tupaki Desk | 14 Sep 2022 12:21 PM GMTశింబు హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ సినిమా `వెందు తనిందదు కాడు`. గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని తెలుగులో `ద లైఫ్ ఆఫ్ ముత్తు` పేరుతో స్రవంతి మూవీస్ అధినేత రవికిషోర్ రిలీజ్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ సెప్టెంబర్ 15న ఫస్ట్ పార్ట్ ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల తెలుగులో మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 17న విడుదలవుతోంది.
ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. తెలుగులో రిలీజ్ ఆలస్యానికి కారణం అనుకున్న సమయానికి డబ్బింగ్, రీ రికార్డింగ్ కార్యక్రమాలు ఆలస్యం కావడమేనని తెలుస్తోంది. సిద్ధీ ఇద్నాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గరపడటంతో మేకర్స్ బుధవారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. నటి రమ్యకృష్ణ ఈ ట్రైలర్ కు వాయిస్ ఓవర్ అందించారు. శింబు పాత్రని పరిచయం చేస్తూ ఆమె ట్రైలర్ కు వాయిస్ ఓవర్ అందించడం విశేషం.
`కొన్నిసార్లు నిజం చెప్పడం.. కథ అల్లడం కంటే కష్టం..ఇది ఓ నిజమైన మనిషి కథ. ఎదుగుతున్న కొద్దీ ఎదురయ్యే ఒంటరి తనం..మనుషులు ఎవరూ ఉండని కొండ అంచున నిలబడినట్టు.. ఏగాలీ ఎవరిని ఎటు తీసుకెళుతుందో ఎవరికీ తెలియదు..`అంటూ రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ఓ సాధారణ యువకుడు విధిఆడిన నాగకంలో విధిలేక గ్యాంగ్ స్టర్ గా మారిన క్రమాన్ని ఈ మూవీలో చర్చించినట్టుగా తెలుస్తోంది.
శింబు యుక్త వయసు నుంచి పరిపూర్ణమైన వ్యక్తిగా పలు దశల్లో కనిపిస్తూ సాగే రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని గౌతమ్ మీనన్ తెరకెక్కించాడు. శింబు నటన, గౌతమ్ మీనన్ టేకింగ్, ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన హైలైట్స్ గా నిలుస్తున్నాయి. `అర్థం వున్నా లేకపోయినా ఇది కాదు జీవితం.. ఒంటరిగా వేసే ప్రతి అడుగూ నిప్పుతో చెలగాటం అనే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
ఆద్యంతం ఉద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ ట్రైలర్ లో శింబు ముందు ఏమీ తెలియని అమాయకుడిగా, ఓ పల్లెటూరి యువకుడిగా కనిపించాడు. ఆ తరువాత గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన క్రమం, పరిస్థితుల్ని దర్శకుడు కళ్లకు కట్టినట్టగా చూపించిన తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. తొలి భాగంగా వస్తున్న ఈ మూవీ ధింబు, గౌతమ్ మీనన్ లకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.