Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: మృగరాజు విశ్వరూపం
By: Tupaki Desk | 2 July 2019 5:28 AM GMTమనదగ్గర పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు కానీ హాలీవుడ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ సిరీస్ లు ఎన్ని సీక్వెల్స్ వచ్చినా ఆదరణ విషయంలో మాత్రం క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈ నెలలో ఏకంగా రెండు వస్తుండటం విశేషం. ఎల్లుండి స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సందడి చేయనుండగా 19న ది లయన్ కింగ్ రచ్చ చేయబోతున్నాడు. ఈ సందర్భంగా దీని ట్రైలర్ విడుదల చేశాడు.
ఆసాంతం కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ జీవకళ ఉట్టిపడే యానిమేషన్ పాత్రలు మొత్తంగా చిన్న పిల్లలనే కాదు పెద్దలను కూడా అలరించేలా ఓ రేంజ్ లో ఉంది ట్రైలర్. డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి శంకర్ శంకర్ వాయిస్ తో మొదలై జగపతిబాబు గొంతులో అడవిని పాలిస్తున్న సింహం తన బిడ్డకు హితబోధ చేస్తున్న తీరుతో ఆసక్తి కలిగేలా కట్ చేశారు. కానీ నాని చెప్పిన డబ్బింగ్ మాత్రం దాచి ఉంచారు. అలీ బ్రహ్మానందం గొంతులు కూడా వినిపించలేదు. సో ఫ్యాన్స్ కి థ్రిల్ కలిగించాలనే ఉద్దేశంలో నేరుగా చూపించబోతున్నారన్న మాట.
మొత్తానికి ది లయన్ కింగ్ అంచనాలు పెంచేసింది. మొదటి భాగాల కంటే ఎక్కువ కంటెంట్ తో ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేస్తున్న సింహారాజు ఈసారి పెద్దలను కూడా పడేసేలా ఉన్నాడు.జులై 19 సౌత్ లోని అన్ని భాషల్లోనూ విడుదల కాబోతున్న ది లయన్ కింగ్ అంచనాల విషయంలో గత ఏడాది వచ్చిన జంగిల్ బుక్ ని దాటేసేలా ఉంది. డిస్నీ సంస్థ డబ్బింగ్ విషయంలో రాజీ పడకుండా స్టార్ యాక్టర్స్ ని సెట్ చేసుకోవడంతో క్వాలిటీ ఇంకా పెరిగిపోయింది. ఇటీవలే అల్లాయుద్దీన్ లో వెంకటేష్ వరుణ్ తేజ్ గొంతుకలు ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు మరోసారి మన తెలుగు తారల హంగామాను ఇంగ్లీష్ సినిమాలో ఎంజాయ్ చేయబోతున్నారు