Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: `ల‌వ్ లీ` లుక్ కిరాకే

By:  Tupaki Desk   |   17 March 2019 9:57 PM IST
ఫోటో స్టోరి: `ల‌వ్ లీ` లుక్ కిరాకే
X
క‌న్న‌డ బ్యూటీ శాన్వి యంగ్ హీరో ఆది స‌ర‌స‌న `ల‌వ్ లీ` అనే చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. బి.జ‌య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ కి కుర్ర‌కారు ప‌రేషాన్ అయ్యారు. ఆ త‌ర్వాత సుశాంత్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టించింది శాన్వి. కానీ ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. అటుపై మంచు విష్ణు స‌ర‌స‌న కాస్తంత గ్లామ‌ర‌స్ రోల్ లో క‌నిపించి మెప్పించింది.

అయితే క‌న్న‌డ ఇండ‌స్ట్రీ ఇచ్చిన‌ట్టు త‌న‌కు టాలీవుడ్ ఆశించిన హిట్టు ఇవ్వ‌లేదు. ఆ క్ర‌మంలోనే సొంత ప‌రిశ్ర‌మ‌కే ప‌రిమిత‌మైపోయింది. అక్క‌డ వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ కెరీర్ ప‌రంగా బిజీ బిజీ గా ఉంది. `కేజీఎఫ్` స్టార్ య‌శ్ స‌ర‌స‌న ఈ అమ్మ‌డు ఇటీవ‌ల‌ `మ‌ఫ్టీ` అనే చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం మ‌రో యువ‌హీరో ర‌క్షిత్ శెట్టి స‌ర‌స‌న `అవ‌నే శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌` అనే చిత్రంలో ఆడి పాడుతోంది.

లేటెస్టుగా అదిరిపోయే ఫోటోషూట్ తో అభిమానుల్లో వేడి పెంచేసింది. ఓ ప్ర‌త్యేక‌మైన కాన్సెప్టు తో ఈ ఫోటో సూట్ చేశారు. ఒక‌ అంద‌మైన కొల‌ను ప‌రిస‌రాల్లో .. అలాగే గ్రీన‌రీలో శాన్వీ ఇచ్చిన ఫోజులు యూత్ ని క‌వ్విస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. మోడ్ర‌న్ ఔట్ ఫిట్ కి శాన్వి పెర్ఫెక్ట్ యాప్ట్. వైట్ టాప్.. కాంబినేష‌న్ క‌ల‌ర్ ఫుల్ డ్రెస్ తో మైమ‌రిపిస్తోంది. శాన్వి లేటెస్ట్ లుక్ బావుంది. ఈ క్యూటీ అంద‌చందాల‌కు ఫిదా అయ్యి టాలీవుడ్ లోనూ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అవ‌కాశాలిస్తారేమో చూడాలి.