Begin typing your search above and press return to search.
'పుష్ప' కోసం మేకర్స్ ప్లాన్ అదిరిందిగా
By: Tupaki Desk | 8 March 2022 4:38 AM GMTబ్లాక్ బస్టర్ చిత్రాలకు సంబందించిన ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని ప్రేక్షకుల మధ్యకు తీసుకొస్తూ ఆ మూవీని మళ్లీ మళ్లీ గుర్తు చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. జూక్ బాక్స్ లంటూ ఆడియో సాంగ్స్ ని రిలీజ్ చేయడం దగ్గరి నుంచి సినిమాలో కీలక ఘట్టాలకు సంబంధించిన షాట్ వీడియోలు, డైలాగ్ ప్రోమోలని రిలీజ్ చేస్తుంటారు. 'బాహుబలి' మేకర్స్ ఈ విషయంలో మరింత అడ్వాన్స్ గా ఆలోచించి బుక్స్.. కార్టూన్స్ అంటూ రక రకాలుగా 'బాహుబలి'ని ఏళ్ల పాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా చేశారు.
'పుష్ప' టీమ్ కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతోందా? అంటే తాజా పరిణామాలు అలానే వున్నట్టుగా కనిపిస్తోందని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ మూవీ 'పుష్ప ది రైజ్'. రెండు బాగాలుగా తెరకెక్కించాలని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేసిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 'పుష్ప ది రైజ్'. బన్నీ ఊరమాస్ పాత్రలో పుష్పరాజ్ గా గంధపు చెక్కల స్మగ్లర్ గా నటించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
రూరల్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం నేషనల్ వైడ్ గా సంచలనాలు సృష్టించి వసూళ్ల పరంగా సరికొత్త చరిత్రని తిరగరాసింది. ఊహించని విధంగా ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 330 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన సినిమాగా నిలిచింది.
రికార్డు స్థాయి వసూళ్లతో పాటు 'పుష్ప' చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా పుష్ప .. పుష్ప.. అంతగా ఈ సినిమా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. మేకర్స్ తో పాటు డైరెక్టర్ సుకుమార్, హీరో బన్నీ ఈ స్థాయి రెస్పాన్స్ ని ఊమించలేదట.
అంతగా పుష్ప మేనియా వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించి అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. బన్నీ వన్ మ్యాన్ షోగా విడుదలై వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన ఈ మూవీ పాటలు, డైలాగ్స్ విషయంలోనూ హ్యూజ్ క్రేజ్ ని దక్కించుకుంది. ఈ మూవీలోని పుష్ప సిగ్నేచర్ స్టెప్ ని రీ క్రియుట్ చేయని స్టార్ లేడు. క్రికెటర్లు, స్టార్ లు ..ఇలా ప్రతీ ఒక్కరూ ఈ మూవీలోని తగ్గేదేలే డూలాగ్ మేనరిజాన్ని.. శ్రీవల్లీ స్టెప్ ని... ఊ అంటావా.. ఊహూ అంటావా లోని హుక్ స్టెప్ ని వరల్డ్ వైడ్ గా వైరల్ చేశారు.
పుష్ప మేనియాని గమనించిన మేకర్స్ కొత్త ప్లాన్ తో ముందుకొచ్చారు. 'పుష్ప' లవర్స్ తో పాటు బన్నీ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేశారు. పుష్ప కు సంబంధించిన ప్రతీదీ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవడంతో మేకర్స్ డైలాగ్స్ జ్యూక్ బాక్స్ వీడియోని తాజాగా విడుదల చేశారు. ఇంతకు ముందు పాటలకు మాత్రమే జ్యూక్ బాక్స్ విధానం వుండేది. అయితే దాన్ని 'పుష్ప'తో మారుస్తూ సరికొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు. సినిమాలో బన్నీ పలికిన పాపులర్ డైలాగ్స్ ఈ డైలాగ్స్ జ్యూక్ బాక్స్ వీడియోని విడుదల చేశారు.
21 నిమిషాల నిడివితో ఈ వీడియోని రూపొందించారు. ప్రస్తుతం 'పుష్ప' డైలాగ్స్ జ్యూక్ బాక్స్ నెట్టింట వైరల్ గా మారి సందడి చేస్తోంది. 'పుష్ప ది రూల్' ఏప్రిల్ లో సెట్స్ పైకి రానున్న నేపథ్యంలో డైలాగ్స్ జ్యూక్ బాక్స్ ని మేకర్స్ విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.