Begin typing your search above and press return to search.

సమంతను ఒప్పించింది చిరునా?

By:  Tupaki Desk   |   30 Dec 2021 2:30 AM GMT
సమంతను ఒప్పించింది చిరునా?
X
టాలీవుడ్లో మోస్ట్ సెల‌బ్రేటెడ్ క‌పుల్‌గా క‌నిపించిన‌ అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత.. పెళ్ల‌యిన నాలుగేళ్ల‌కే విడిపోతార‌ని ఎవ‌రూ అనుకోలేదు. ఇందుకు దారితీసిన కార‌ణాలేంటో కానీ.. దీని వ‌ల్ల ఎక్కువ బాధింప‌బ‌డుతోంది మాత్రం స‌మంతే అన్న‌ది స్ప‌ష్టం. విడాకుల గురించి రూమ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా చైతూ ఎక్క‌డా దీని గురించి స్పందించిన దాఖ‌లాలే లేవు.

కానీ స‌మంత మాత్రం ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా దీని గురించి త‌ర‌చుగా మాట్లాడుతూనే ఉంది. విడాకులు త‌న జీవితంలో క‌ల్లోలం రేపిన‌ట్లుగా సంకేతాలు ఇస్తోంది. ఒక ర‌కంగా ఆమె డిప్రెష‌న్లోకి వెళ్లిన‌ట్లుగా స‌న్నిహితులు చెబుతున్నారు. అలాంటి టైంలో ఆమెను మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌ ఆమెను ఓదార్చి.. త‌న దృష్టి మ‌ర‌ల్చ‌డంలో భాగంగా పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేయించిన‌ట్లు స‌మాచారం.

పుష్ప టీంకు చెందిన ఓ స‌భ్యుడు చెప్పిన ప్ర‌కారం.. కొన్ని వారాల కింద‌ట‌ స‌మంత రామ్ చ‌ర‌ణ్, చిరు పాల్గొన్న ఒక ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కు వెళ్లింది. చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లతో క‌లిసి స‌మంత ఉన్న ఫొటోలు కూడా అప్పుడు బ‌య‌టికి వ‌చ్చాయి.

ఆ టైంలోనే విడాకుల త‌ర్వాత జీవితం గురించి స‌మంత‌తో చిరు, చ‌ర‌ణ్ మాట్లాడార‌ట‌. స‌మంత డ‌ల్లుగా ఉండ‌టం గ‌మ‌నించి.. ఆమె దాదాపు డిప్రెష‌న్లో ఉంద‌న్న స‌న్నిహితుల మాట‌ల గురించి ప్ర‌స్తావించార‌ట‌. సినిమాల్లో బిజీ అయితేనే దీన్నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌ద‌న్న చ‌ర్చ జ‌రిగి.. చిరునే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయ‌మ‌ని చెప్పార‌ని.. సుక్కుతో కూడా మాట్లాడి ఆయ‌న్ని ఇందుకు ఒప్పించార‌ని స‌మాచారం. అప్ప‌టికి సుక్కు ర‌క‌ర‌కాల ఆప్ష‌న్లు ప‌రిశీలిస్తున్న‌ప్ప‌టికీ.. చిరు చెప్ప‌డంతో స‌మంత‌తోనే ఈ పాట చేయించార‌ట‌.

చిరు ఆలోచ‌న ఫ‌లించి ఈ పాట‌తో స‌మంత టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఈ పాట‌తోనే ఆమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయింది. ఈ సాంగ్ రిలీజైన‌ప్ప‌టి నుంచి స‌మంత గురించే సోష‌ల్ మీడియా చ‌ర్చ‌ల‌న్నీ. దీనికి వ‌చ్చిన స్పంద‌న ప‌ట్ల కూడా స‌మంత చాలా హ్యాపీగా ఉన్న సంగ‌తి అర్థ‌మ‌వుతూనే ఉంది.