Begin typing your search above and press return to search.
ఫొటోటాక్‌ః ఉదయిస్తున్న సూర్యుడిని డామినేట్ చేస్తున్న 'చందమామ' అందం
By: Tupaki Desk | 23 May 2021 10:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ వయసు పెరుగుతున్నా కొద్ది మరింత అందం పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. చందమామలాంటి అందం అంటూ చందమామ సినిమా తో అనిపించుకున్న కాజల్ ఆ తర్వాత మగధీర సినిమాతో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయి అందంకు అందం.. అభినయంకు అభినయం అన్నట్లుగా కాజల్ సుదీర్ఘ కాలం పాటు కెరీర్ లో దూసుకు పోతుంది. అందం మరియు అభినయం విషయంలో తనకు తానే సాటి అన్నట్లుగా ఉండే ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ లో ఉంది.
నెట్టింట ఉదయిస్తున్న సూర్యుడి ముందు కాజల్ నిల్చున్న ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందమైన ఉదయిస్తున్న సూర్యుడు చందమామ వంటి కాజల్ అందం ముందు చిన్నబోయాడు అనిపిస్తుంది. ఎర్రటి సూర్యుడు అద్బుతంగా బ్యాక్ గ్రౌండ్ లో ఉండగా అంతకు మించిన అందంతో కాజల్ నిల్చుని ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కాజల్ మరింత అందంగా తయారవుతుందే అంటున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. మరో వైపు వెబ్ సిరీస్ లు కూడా ఈమె చేస్తోంది.