Begin typing your search above and press return to search.
'బంగార్రాజు' టైటిల్ పోస్టర్: సోగ్గాళ్ల షూటింగ్ ప్రారంభం..!
By: Tupaki Desk | 25 Aug 2021 1:30 PM GMTకింగ్ అక్కినేని నాగార్జున మూడు దశాబ్దాలకు పైగా ఉన్న తన సినీ కెరీర్ లో ప్రతి జానర్ లోనూ విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్తవాళ్లను పరిచయం చేసి సెల్యులాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్నారు. ఈ క్రమంలో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అలానే తనయుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కూడా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తండ్రీకొడుకుల ద్వయం కలిసి ''బంగార్రాజు'' చిత్రంతో ప్రేక్షకులకు అలరించడానికి రెడీ అయ్యారు.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం నాగార్జున కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ''బంగార్రాజు'' చిత్రం రాబోతోంది. ఇందులో నాగ్ తో పాటుగా పెద్ద కుమారుడు నాగ చైతన్య కూడా కనిపించనున్నారు. ఇటీవలే క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో ఈరోజు బుధవారం నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈసారి తండ్రి-కొడుకు ద్వయం తమదైన శైలిలో అలరించడానికి వస్తున్నారని చెప్పడానికి సింబాలిక్ గా రెండు బైక్స్ ని ఈ పోస్టర్ లో చూపించారు.
మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ ''బంగార్రాజు'' చిత్రానికి కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ.. చైతన్య కు జోడీగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. చలపతి రావు - రావు రమేష్ - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ - ఝాన్సీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే రాయగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
''బంగార్రాజు'' చిత్రం రొమాన్స్, ఎమోషన్స్ మరియు ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసిన మంచి ఎంటర్‌టైనర్ గా రూపొందించబడుతోంది. బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. గతంలో అక్కినేని మల్టీ స్టారర్ 'మనం' లో తండ్రీ-కొడుకులు నాగ్ - చైతూ కలిసి నటించారు. ఇది ఆల్ టైమ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా.. అక్కినేని ఫ్యామిలీకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో మరోసారి తండ్రీకొడుకుల ద్వయం కలిసి నటిస్తున్న ''బంగార్రాజు'' చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.