Begin typing your search above and press return to search.

MAA వార్.. ఏక‌గ్రీవం దేనికి? ప్ర‌త్య‌ర్ధుల‌కు భ‌య‌మా..?!

By:  Tupaki Desk   |   8 Sep 2021 6:33 AM GMT
MAA వార్.. ఏక‌గ్రీవం దేనికి? ప్ర‌త్య‌ర్ధుల‌కు భ‌య‌మా..?!
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ‌ర్గ‌పోరు తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు పోరు కొన‌సాగుతోంది. పోటీ దారుల మ‌ధ్య మ‌ళ్లీ మాట‌ల యుద్ధం ముదిరే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జీవితా రాజ‌శేఖ‌ర్ ఎంట్రీతో ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేయాల‌నుకున్న బండ్ల గ‌ణేష్ త‌ప్పుకుని సంచ‌ల‌నానికి తెర లేపారు. అటుపై బండ్ల వ్యాఖ్య‌లు.. జీవిత కౌంట‌ర్లు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. రెండు..మూడు రోజులుగా మీడియాలో అదే అంశంపై ప్ర‌త్యేక డిబేట్లు న‌డిచాయి.

తాజాగా అద్య‌క్ష ప‌ద‌వి బ‌రిలో కి దిగుతోన్న ప్ర‌కాష్ రాజ్ తాజా ఎన్నిక‌ల వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. మా ఎన్నిక‌లు ఏక‌గ్రీవం కాకూడ‌దు. క‌చ్చితంగా పోటీ జ‌రిగి తీరాల్సిందే. ఓట‌ర్లు ఓట్లు వాళ్ల‌కు న‌చ్చిన వాళ్ల‌కు వేయాలి. కౌంటింగ్ జ‌ర‌గాలి. ఫ‌లితాలు రిట‌ర్నింగ్ అధికారి వెల్ల‌డించాలి.. ఇదే స‌రైన ప‌ద్ధ‌తి! అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఏక‌గ్రీవం త‌న‌కు ఎంత మాత్రం ఇష్టం లేద‌ని ఆయ‌న అన్నారు.

ఎన్నిక ఏదైనా కానీ ఎన్నిక‌ల వేళ చ‌ర్చ జ‌ర‌గాలి. ఇప్పుడ‌ది జ‌రుగుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు ఈ రెండేళ్లు ఏం చేసారో చూడాలి. త‌దుప‌రి ఏం చేయాల‌న్న‌ది ఆలోచించాలి. అలాంటి వాతావ‌ర‌ణ‌మే అసోసియేష‌న్ కి మంచింది. మంచి ..చెడులు విశ్లేషించుకోవాలంటే పోటీ ఉండాలి. అదే ఏక‌గ్రీమైతే చ‌ర్చ‌లు ఉండ‌వు. ఏం చేయాల‌న్న దానిపై క్లారిటీ కూడా ఉండ‌దు.

ఎన్నిక‌లంటే ఓడిపోవ‌డం.. గెల‌వ‌డం కాదు. అస‌లు గ‌తంలో ఏం జ‌రిగిందో చూడాల‌న్నారు. మంచి అభ్య‌ర్ధిని ఎన్నుకునే ప‌క్రియ ఎన్నిక‌లు మాత్ర‌మే క‌ల్పిస్తాయ‌న్నారు. గ‌తంలో విష్ణుతో మాట్లాడాను. అంకుల్ మీరు పోటీ చేస్తున్నారా? ఆ విష‌యం తెలిస్తే మానేసేవాడిని అన్నారు. న‌రేష్ తో మాట్లాడాను. ఆయ‌న ఆల్ ది బెస్ట్ చెప్పారు. త‌న‌ని నాన్ లోక‌ల్ అన్న‌వారు అదే ఎజెండాతో ఎన్నిక‌లకు వెళ్లాల‌ని.. నాన్ లోక‌ల్ కి ఓటు వేయొద్ద‌ని క్యాపెనింగ్ చేయ‌గ‌ల‌రా? అని స‌వాల్ విసిరారు ప్ర‌కాష్ రాజ్.

అయితే ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ పై గెలుపే ధ్యేయంగా ఇప్పుడు మంచు విష్ణు ప్యానెల్ తో క‌లిసి వీ.కే.న‌రేష్ కూడా ప‌ని చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అధికార‌మే ప‌రమావ‌ధిగా ఎవ‌రికి వారు ప్ర‌చారం సాగిస్తున్నారు. ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేస్తున్నారు. కానీ చివ‌రికి మేమంతా ఒక‌టే అంటూ సాంత్వ‌న మాట‌లు చెబుతున్నారు. అక్టోబ‌ర్ 10 అంటే ఇంకో నెల‌రోజులు పైనే ఉంది. అప్ప‌టివ‌ర‌కూ ఇరు వ‌ర్గాల న‌డుమా మాట‌ల తూటాలు ఏ రేంజులో పేల్తాయో అర్థం కావ‌డం లేదు. ఇంత‌కుముందు జైల్లో ఉండాల్సిన వాళ్లు అంటూ మంచు విష్ణు చేసిన కామెంట్ ని సినీపెద్ద‌లెవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అంటే మ‌ళ్లీ ఆ స్థాయిలో కామెంట్లు వినాల్సి ఉంటుంద‌ని 950 మంది ఆర్టిస్టుల్లోనూ చర్చ సాగుతోంది. ప్ర‌స్తుతానికి విందు రాజ‌కీయాలు జోరందుకున్నాయి. నైట్ పార్టీలు హుషారుగానే సాగుతున్నాట.

జీవిత వ‌ర్సెస్ బండ్ల‌.. మ‌రి హేమ‌?

ఇంత‌కుముందు మూవీ ఆర్టిస్టుల‌కు ఎన్నిక‌లు అన‌గానే తొలిగా మ‌హిళా అధ్య‌క్షురాలిని ఎన్నుకుంటారంటూ ప్ర‌చార‌మైంది. ఏక‌గ్రీవం చేస్తే ఒక మ‌హిళ‌ను అధ్య‌క్షురాలిని చేయాల‌ని మంచు విష్ణు కూడా అన్నారు. ఆ క్ర‌మంలోనే జీవిత హేమ కాకుండా స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌కు అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌ని అంతా భావించారు. కానీ ఇప్పుడు వీళ్లెవ‌రూ లేనే లేదు. ఇక జీవిత జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌పున పోటీ చేస్తుంటే హేమ అదే ప్యానెల్ నుంచి మ‌రో కీల‌క‌ ప‌ద‌వికి పోటీ ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక‌పోతే మా క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాక హేమ నోరు అదుపులో ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.