Begin typing your search above and press return to search.
మహేష్.. త్రివిక్రమ్ ల 'అతడే పార్థు'
By: Tupaki Desk | 25 July 2021 11:30 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వక పోయినా కూడా ఇప్పటికి బుల్లి తెరపై మంచి ఆధరణ దక్కించుకుంటుంది. ఆ రెండు సినిమాలు కూడా పెద్ద హిట్ అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. సరైన టైమ్ లో రాని కారణంగా ఆ సినిమాల ఫలితాలు నిరాశ పర్చాయి కాని అసలు అయితే ఆ సినిమాలు మంచి కంటెంట్ మూవీస్ అంటూ పలువురు సినీ విమర్శకులు కితాబు ఇస్తూ ఉంటారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహేష్ బాబుమ రియు త్రివిక్రమ్ ల కాంబోలో సినిమా పట్టాలెక్కబోతుంది.
భారీ అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అదేంటి అంటే ఈ సినిమాలో హీరోయిన్ త్రిషను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. ఆమె మహేష్ బాబుకు తల్లి పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. నందు.. పూరిల కొడుకు పార్థు కథతో ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా చెబుతున్నారు. మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట.
ఈ సినిమాకు అతడే పార్థు అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా ఏమో కాని ఈ పుకారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని.. నిజంగా సినిమా ఇలాగే ఉంటే తప్పకుండా ఓ రేంజ్ లో విజయం సాధించడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా నిజంగా కథ ఇదే అయితే బాగుండు.. అతడే పార్థ టైటిల్ కూడా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాని ఈ విషయంలో మాత్రం యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఆమద్య యూనిట్ సభ్యుల్లో ఒకరు అతడు సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడారు. మరి సంబంధం ఉందా లేదా అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.