Begin typing your search above and press return to search.
తన సాంగ్ రీమిక్స్ చేయడంపై అసహనానికి గురైన మ్యూజిక్ డైరెక్టర్
By: Tupaki Desk | 10 April 2020 12:30 AM GMTసూపర్ హిట్ అయిన సినిమా సాంగ్స్ ను రీమిక్స్ చేయడం సినీ ఇండస్ట్రీలో మొదటి నుండి వస్తున్నదే. పాత సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేయటం ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా కొనసాగుతోంది. దీనికి మన టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. అయితే కొన్ని పాటలు మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. సరిగా మెప్పించని పాటలు సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలకు గురవుతుంటాయి. ఈ క్రమంలో ఏఆర్ రెహ్మాన్ సూపర్ హిట్ సాంగ్ ఒక దాన్ని ఇప్పుడు బాలీవుడ్ లో రీమిక్స్ చేశారు. ఇది సంగీత దర్శకుడు రెహ్మాన్ కి అసహనాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళ్తే సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా నటించిన 'మసాక్కలీ 2.0' పేరుతో హిందీ పాట ఒకటి ఇటీవల విడుదలైంది. కొత్త వర్షన్ మసాక్కలి పాటను తనీష్ బాగ్చి రూపొందించారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా ఈ మసాక్కలి 2.0 పాటపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ట్విటర్‌లో స్పందించారు.
'ఒక పాటను రూపొందించడానికి నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుంది. పలుమార్లు మార్చి మార్చి పాటను రూపొందించాల్సి ఉంటుంది. ఒరిజినల్ మసాక్కలి పాట కోసం సుమారు 200 మంది సంగీతకారులు పనిచేశారు. అందుకే ఒకసారి ఒరిజినల్ మసాక్కలీ పాటను విని సంతోషించండి' అని రెహ్మాన్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ ద్వారా రెహ్మాన్ అసహనానికి గురైనట్లు అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మసాక్కలి ఒరిజనల్ పాట లిరిక్స్ కూడా షేర్ చేశాడు.
కాగా ఈ పాటను ఏఆర్ రెహమన్ 12 ఏళ్ల క్రితం వచ్చిన 'ఢిల్లీ 6' మూవీ కోసం కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పాట పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ పాటను మోహిత్ చౌహాన్ పాడగా, ప్రసూన్ జోషి సాహిత్యం అందించారు. ఇక 'ఢిల్లీ 6' సినిమాలో సోనమ్ కపూర్ - అభిషేక్ బచ్చన్ లు జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే రెహ్మాన్ మ్యూజిక్ అందించిన 'బొంబాయి'లో బాగా హిట్టైన 'అరబిక్ కడలందం' పాటను హిందీలో 'ఓకే జానూ'లో రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే.