Begin typing your search above and press return to search.
రియా బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో సవాల్...!
By: Tupaki Desk | 7 Oct 2020 2:10 PM GMTడ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తికి నేడు(బుధవారం) బాంబే హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో సెప్టెంబర్ 8న రియాని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ) ముంబై బైకుల్లా జైలులో ఉంచారు. నెల రోజులుగా జైలులో ఉన్న రియా నేడు కోర్ట్ బెయిల్ ఇవ్వడంతో బయటకు రానుంది. అయితే రియా బెయిల్ ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఎన్సీబీ తెలిపింది. ఈ కేసులో చట్టపరమైన పలు ప్రశ్నలు ఇమిడి ఉన్నాయని.. అందుకే రియాకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ తెలిపారు.
కాగా, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా మరియు ఆమె సోదరుడు షోవిక్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను గత నెల 11న ఎన్సీపీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించగా బుధవారం పలు షరతులతో పాటు రూ.లక్ష వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. వరుసగా పది రోజులపాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో రియా హాజరుకావాలని.. పాస్ పోర్టును అప్పగించాలని.. అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అయితే రియా సోదరుడు షోయిక్ చక్రవర్తికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇప్పటికే ఈ కేసులో మేనేజర్ శామ్యూల్ మిరిండా మరియు దీపేశ్ సావంత్ లకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.