Begin typing your search above and press return to search.

ఓల్డ్ బాంబే మెంటాలిటీ ఏంటిదీ మ్యాడ‌మ్

By:  Tupaki Desk   |   22 Jan 2022 7:30 AM GMT
ఓల్డ్ బాంబే మెంటాలిటీ ఏంటిదీ మ్యాడ‌మ్
X
బాంబే ఒక‌ప్పుడు గొప్ప.. ఇప్పుడు కాదు! దేశానికి ఆర్థిక రాజ‌ధానిగా ఎదిగిన బాంబే లేదా బొంబాయి అంటే ఒక‌ప్పుడు దేశానికి హార్ట్ గా భావించేవారు. కానీ ఇప్పుడు చాలా న‌గ‌రాలు మెట్రో సిటీలుగా ఎదిగేశాయి. ఇప్పుడు సౌత్ లో బెంగ‌ళూరు- హైద‌రాబాద్ లాంటి న‌గ‌రాలు ధీటుగా ఎదిగేసాయి.

ముంబై అంత ల‌గ్జ‌రీ ఇక్క‌డా క‌నిపిస్తోంది. ముంబైలో ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతులు నివ‌శిస్తున్నా.. అసాధార‌ణ క్రేజ్ తో వెలిగిపోతున్న బాలీవుడ్ ఉన్నా కానీ ఇప్పుడు వీళ్ల‌కు ధీటుగా ఇత‌ర న‌గ‌రాల్లోనూ వెలిగిపోతున్నారు.

కాలంతో పాటే మార్పు. సినీప‌రిశ్ర‌మ‌ల్లోనూ జరుగుతోంది అదే. ఇటీవ‌లి కాలంలో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ అని చెప్పుకునే బాలీవుడ్ కి ధీటుగా సౌత్ సినిమా ఎదిగేస్తోంది.

ముఖ్యంగా టాలీవుడ్ ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాకి ధీటుగా తెలుగు సినిమా అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. టాలీవుడ్ కి తెలుగుతో పాటు హిందీ-త‌మిళం-మ‌ల‌యాళంలోనూ క్రేజ్ ఉంది. కానీ హిందీ సినిమాల్ని అనువ‌దిస్తే తెలుగు స‌హా సౌత్ లో ఆడుతుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ కొత్త ప‌రిణామం మింగుడుప‌డ‌నిదిగానే ఉంది.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో బాలీవుడ్ తో పోలుస్తూ.. స‌పరేట్ చేస్తూ ప్రాంతీయ ప‌రిశ్ర‌మ అంటూ తెలుగు చిత్ర‌సీమ‌ను ఉద‌హ‌రించింది యువ‌న‌టి అన‌న్య పాండే. తెలుగు స‌హా ఇత‌ర సౌత్ భాష‌ల్లో న‌టించాల‌నుంద‌ని చెబుతూనే ఇలా ప్రాంతీయం అంటూ చిన్న‌చూపు చూసింది తెలిసీతెలియ‌కుండానే. అయితే దీనిపై కౌంట‌ర్లు ప‌డుతున్నాయి.

అదో ర‌క‌మైన బూర్జువా మైండ్ సెట్ తోనే అన‌న్య ఇలా అనేసిందా? పాత‌కాలం బాంబే మైండ్ సెట్ మార్చుకోవాలంటూ కౌంట‌ర్లు వేస్తున్నారు యూత్.

లైగ‌ర్ చిత్రంతో తెలుగు చిత్రసీమ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ బ్యూటీకి పాన్ ఇండియా స్టాట‌స్ ఇస్తోందే తెలుగు సినిమా. అందువ‌ల్ల దీనిని ప్రాంతీయ చిత్ర‌సీమ‌గా ఎలా చూస్తావ్ అమ్మ‌డూ? అంటూ పంచ్ లు వేస్తున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ కంటే బెస్ట్ మేమేన‌ని తెలుగు ప‌రిశ్ర‌మ వాసులు నిరూపిస్తున్నాయి. పుష్ప చిత్రం 83 కంటే బెస్ట్ వ‌సూళ్ల‌ను సాధించింద‌ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి లైగ‌ర్ బ్యూటీకి క‌ళ్లు భైర్లు క‌మ్మే ట్రీటిస్తున్నారు తెలుగు యూత్