Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: పాత కథనే తిప్పి కొట్టారు
By: Tupaki Desk | 31 Aug 2021 1:30 AM GMTప్రతిసారీ కొత్త కథతో సినిమా తీయడం కష్టం. పాత కథల్నే అటు ఇటు తిప్పి కొత్త సినిమాలు తీయడం మామూలే. ఇప్పుడు ఇలాంటి సినిమానే ఒకటి బహు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రమే.. అనబెల్-సేతుపతి. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సత్తా చాటుకున్న తాప్సి జంటగా నటించిన సినిమా ఇది. హాట్ స్టార్ ద్వారా సెప్టెంబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దీని ట్రైలర్‌ను వివిధ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది. ఇదొక హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కిన చిత్రమని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమైంది. ట్రైలర్ కూడా అలాగే ఉంది.
కొన్నేళ్ల కిందట తెలుగులో 'ఆనందో బ్రహ్మ' అనే కామెడీ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. 'పాఠశాల'తో దర్శకుడిగా పరిచయమైన మహి వి.రాఘవ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. తాప్సి అందులో కీలక పాత్ర పోషించింది. మామూలుగా హార్రర్ కామెడీ సినిమాల్లో దయ్యాల్ని చూసి మనుషులు భయపడుతుంటారు. కానీ ఇందులో వెరైటీగా మనుషుల్ని చూసి దయ్యాలు భయపడుతుంటాయి. ఈ వెరైటీ కాన్సెప్ట్ కొత్తగా అనిపించి అందరినీ ఆకట్టుకుంది. దాదాపుగా ఇదే కాన్సెప్ట్‌తోనే 'అనబెల్-సేతుపతి' తెరకెక్కినట్లుగా అనిపిస్తోంది. ఒక మహల్‌ను చేజిక్కించుకోవడానికి వేర్వేరు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా.. ఆ మహల్లో దయ్యాలుంటాయి. దయ్యాల్ని భయపెట్టడానికి దయ్యాల వేషాలేసుకుని ఒక బ్యాచ్ దిగుతుంది. దయ్యాలు కూడా అక్కడి నుంచి విముక్తులు కావడం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇరువురి మధ్య ఎత్తులు పై ఎత్తుల నేపథ్యంలో ఫన్నీగా సాగే సినిమాలా కనిపిస్తోంది 'అనబెల్ సేతుపతి'.
ట్రైలర్ వరకైతే హడావుడి బాగానే కనిపించింది. విజయ్ సేతుపతి.. తాప్సి చేసే స్థాయి పాత్రలైతే కావు వారివి. ఇందులో జగపతి బాబు ఓ కీలక పాత్ర చేశారు. దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్ చివర్లో.. ఏదైనా కొత్త కథ చెప్పరా అని ఒక పాత్ర అంటే.. ఈ రోజుల్లో కొత్త కథతో సినిమా ఎవరు తీస్తున్నారు.. పాత కథల్ని తిప్పి తిప్పి కదా తీస్తున్నారు అంటూ ఈ సినిమాలో కొత్తదనం ఉండదని.. పాత కథనీ రీహ్యాష్ చేశారనే సంకేతాలు ఇచ్చేశారు. కామెడీ వర్కవుట్ అయితే సినిమా హిట్టయినట్లే అన్నమాట.