Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నుంచి మ‌హేష్ కి మాత్ర‌మే ఛాయిస్

By:  Tupaki Desk   |   5 May 2022 12:30 AM GMT
టాలీవుడ్ నుంచి మ‌హేష్ కి మాత్ర‌మే ఛాయిస్
X
తెలుగు సినిమాలు హిందీ బెల్ట్ లో సంచ‌ల‌న విజ‌యాలు సాధిస్తున్నాయి. బాహుబ‌లి1- బాహుబ‌లి 2- సాహో- ఆర్.ఆర్.ఆర్ ఉత్త‌రాది నుంచి తెచ్చిన వ‌సూళ్లే ఇందుకు నిద‌ర్శ‌నం. కానీ వీటిలో ఒక్క బాహుబ‌లి ఫ్రాంఛైజీ మిన‌హా ఏ ఇత‌ర సినిమా ఆశించినంత‌గా త‌మిళంలో ఆడ‌లేదు. దీనికి కార‌ణ‌మేమిటీ ? అంటే తంబీల యూనిటీ. త‌మ హీరోల సినిమాల్ని త‌ప్ప ఇత‌ర భాష‌ల నుంచి వ‌చ్చే సినిమాల‌ను చూసేందుకు ఎవ‌రూ థియేట‌ర్ల‌కు రారు. భాషాభిమానం ప్రాంతీయ అభిమానంలో త‌మిళ తంబీల్ని కొట్టేవాళ్లు లేరు దేశంలో. ఇది చాలాసార్లు నిరూప‌ణ అయ్యింది.

టాలీవుడ్ నుంచి ఎంత పెద్ద హీరో సినిమా వ‌చ్చినా తంబీలు తిరస్క‌రించారు ఒక్క బాహుబ‌లిని త‌ప్ప‌. బాహుబ‌లి సిరీస్ సినిమాలు త‌మిళ ఆడియెన్ నుంచి వంద కోట్లు పైగా క‌లెక్ట్ చేయ‌డంలో స‌క్సెస‌య్యాయి. కానీ ఆ త‌ర్వాత ఏ ఇత‌ర తెలుగు సినిమా అక్క‌డ అంత‌గా ఆడ‌లేదు. తెలుగు హీరోల్ని ఎంక‌రేజ్ చేసేందుకు త‌మిళులు ఏమాత్రం ఆస‌క్తిగా లేరు. అయితే ఇన్నాళ్టికి ఒక్క మ‌హేష్ కి ఆ అరుదైన అవ‌కాశం ద‌క్కింది. తెలుగు హీరోల్లో అంతో ఇంతో సూపర్ స్టార్ మ‌హేష్ కి త‌మిళ బెల్ట్ లో ఆద‌ర‌ణ ఉంద‌న‌డానికి ఇది నిద‌ర్శ‌నం.

ఒక తెలుగు సినిమాని 4 ఏఎం షోకి అనుమ‌తించ‌డం అది కూడా ఫ్యాన్స్ షో అంటూ వేయ‌డం హిస్ట‌రీలో ఇదే తొలిసారి. అలాంటి అవ‌కాశం స‌ర్కారు వారి పాట‌తో మ‌హేష్‌ కి క‌లిగింది. అంటే అత‌డిని ఆరాధించే అభిమానులు తంబీల్లో ఉన్నార‌ని దీనర్థం. చెన్నై రోహిణి సిల్వ‌ర్ స్క్రీన్ పై ఈ స్ప‌ష‌ల్ షో ప‌డ‌నుంది. ఫ‌స్ట్ టైమ్ ఎవ్వ‌ర్ అంటూ ఇప్పుడు మ‌హేష్ త‌మిళ‌ అభిమానుల్లో ఒక‌టే ఆనందం క‌నిపిస్తోంది.

అయితే చెన్నైలో స్థిర‌ప‌డిన తెలుగు వారు చాలా ఎక్కువ‌. అందువ‌ల్ల మ‌హేష్ సినిమాతో పాటు తెలుగు అగ్ర హీరోల సినిమాల‌న్నీ చెన్నైలో భారీగా రిలీజ‌వుతుంటాయి. బావున్న సినిమాల‌కు ఇక్క‌డ ఆద‌ర‌ణ బావుంటుంది. ఇత‌ర హీరోల‌తో పోలిస్తే మ‌హేష్ కి మంచి రికార్డులు ఉన్నాయి. చూద్దాం.. చెన్నై బెల్ట్ నుంచి మ‌ధురై స‌హా ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల నుంచి స‌ర్కార్ వారి వ‌సూళ్లు ఎలా ఉండ‌నున్నాయో?

త‌మిళంలో మ‌హేష్ రేంజు ఎంత‌?

పాన్ ఇండియా సినిమాల‌తో మ‌న స్టార్లు దుమ్ము దులిపేస్తున్నారు. పాన్ ఇండియా రేస్ లో ప్ర‌భాస్ - రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్- య‌ష్ (క‌న్న‌డం) ఇప్ప‌టికే స‌త్తా చాటారు. మునుముందు ఈ రేస్ లోకి మ‌హేష్ కూడా చేర‌బోతున్నారు. స‌ర్కారు వారి పాట త‌ర్వాత‌ రాజ‌మౌళితో మూవీ కోసం అత‌డు స‌న్నాహ‌కాల్లో ఉండ‌డంతో భారీ అంచ‌నాలేర్ప‌డుతున్నాయి. పై పాన్ ఇండియా స్టార్లంతా 1000 కోట్ల క్ల‌బ్ హీరోలు. అందువ‌ల్ల మ‌హేష్ మీద బోలెడంత ప్రెజ‌ర్ ప‌ని చేస్తోంది ఇప్పుడు. అయితే త్వ‌ర‌లోనే రిలీజ‌వుతున్న స‌ర్కార్ వారి పాట స‌న్నివేశ‌మేమిటీ? అన్న‌ది హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికాలో అత్యంత భారీగా విడుద‌ల చేస్తున్నారు. హిట్ట‌యితే 200 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా. ఇక అమెరికాలో బుకింగులు ప్రారంభ‌మ‌య్యాయి. యుఎస్.ఏ లో ప్రీమియ‌ర్ల‌తోనే సేఫ్ జోన్ కి వ‌స్తుంద‌ని టాక్ వినిపిస్తోంది.

అదే క్ర‌మంలో త‌మిళ డ‌బ్బింగ్.. హిందీ డ‌బ్బింగ్ పైనా టీమ్ ఫోక‌స్ చేస్తోంద‌ని స‌మాచారం. తొలిగా త‌మిళ వెర్ష‌న్ ని రెడీ చేస్తున్నార‌ట‌. తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగు వెర్ష‌న్ తో స‌మానంగా అంటే మే 12 న విడుదలవుతోంది. మహేష్ కి తమిళనాట భారీ ఫాలోయింగ్ ఉంది. అత‌డి రేంజు అక్క‌డ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఎస్.వీ.పీతో అక్కడా భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసార‌ని తెలిసింది.

`సర్కారు వారి పాట` బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో మ‌హేష్ .. మోస‌పోయిన బ్యాంక్ మేనేజ‌ర్ వార‌సుడిగా క‌నిపించ‌నున్నారు. త‌న తండ్రి నిజాయితీని నిరూపించే క్ర‌మంలో భావోద్వేగాలు ఎంట‌ర్ టైన్ మెంట్ వ‌గైరా ఆక‌ట్టుకుంటాయ‌ని స‌మాచారం. అందాల‌ కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. థ‌మ‌న్ సంగీతం అందించారు. మ‌రో వారం ప‌దిరోజుల్లో వ‌స్తున్న ఈ మూవీ కోసం మ‌హేష్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.