Begin typing your search above and press return to search.

ఒకేసారి 17 సినిమాల్ని రిలీజ్ చేస్తున్న ఏకైక‌ ఓటీటీ

By:  Tupaki Desk   |   14 Dec 2020 12:30 AM GMT
ఒకేసారి 17 సినిమాల్ని రిలీజ్ చేస్తున్న ఏకైక‌ ఓటీటీ
X
క‌రోనా మ‌హ‌మ్మారీ కి టాటా చెప్పి త్వ‌ర‌లోనే మ‌ల్టీప్లెక్సులు సింగిల్ స్క్రీన్ల‌లో సినిమాల్ని ఆడించాల‌ని నిర్మాత‌లు డిస్ట్రిబ్యూట‌ర్ చైన్స్ ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నాయి. ఎనిమిది నెల‌లుగా ఓటీటీ కంటెంట్ టీవీ కంటెంట్ తోనే థియేట‌ర్ వ్య‌వ‌స్థ స‌ర్వ‌నాశ‌న‌మైంద‌న్న భావ‌న బ‌లంగా నెల‌కొంది.

ఇక ఓటీటీలు బ‌ల‌ప‌డ‌డం థియేట‌ర్ల‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌డం రెండూ ఒక‌టేన‌న్న అభిప్రాయం నెల‌కొంది. ఓవైపు అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ‌లు ఒరిజిన‌ల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను పెంచుకుంటున్నాయి. దీంతో పాటు కార్పొరెట్ దిగ్గ‌జం వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ సైతం సొంత ఓటీటీ వేదిక‌ల్ని బ‌లోపేతం చేస్తూ ఈ క్రైసిస్ వేళ ఎన్ క్యాష్ చేసుకునేందుకు ఓ కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది.

దీని సారంశం ప్ర‌కారం.. ఈ ఒక్క ఏడాదిలో ఏకంగా 17 సినిమాల్ని త‌మ ఓటీటీలో ఏక కాలంలో రిలీజ్ చేయ‌నుందిట‌. అయితే ఈ నిర్ణ‌యంపై ప‌లువురు సినీవిశ్లేష‌కులు తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. అమెజాన్ .. నెట్ ఫ్లిక్స్ తో వ‌చ్చే ముప్పును మించి వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ వంటి బ‌డా సంస్థ‌లు ధ‌న‌బ‌లంతో ఆడే ఆట వ‌ల్ల థియేట‌ర్ వ్య‌వ‌స్థ పూర్తిగా స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.