Begin typing your search above and press return to search.
ఆ సినిమాకు సీక్వెల్ గా వెబ్ సిరీస్
By: Tupaki Desk | 5 Aug 2017 6:30 PM GMTహాలీవుడ్ లో ఏవైనా సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తే ఆ చిత్రాన్ని అంతటితో ఆపేయారు. ఆ సినిమా కథను ఏదో విధంగా పొడిగిస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ వుండడంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా.. చాలా ఉన్నత స్థాయిలో తెరకెక్కిస్తారు. ఇక నొవెల్స్ - కామిక్స్ బుక్స్ ఆధారంగా తెరకెక్కే చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ స్థాయి సినిమాలు కామిక్స్ బుక్ చివరి పేజీ వరకే తెరకెక్కిస్తారు.. కానీ ప్రేక్షకుల మదిలో ఎప్పటికి కి గుర్తుండే రియాలిటీ సినిమాలకి ఎండ్ ఉండదనే చెప్పాలి. ఇప్పుడు అదే తరహాలో హాలీవుడ్ సినిమాలో ఓ మైలు రాయిగా నిలిచిన చిత్రాన్ని వెబ్ సిరీస్ కింద మార్చి తీయలనుకుంటున్నారు.
మార్షల్ ఆర్ట్స్ డ్రామా ఫిల్మ్ గా 1984లో వచ్చిన "ది కరాటే కిడ్" అప్పట్లో మంచి విజయాన్నీ సాధించింది.. 8 మిలియన్ల డాలర్లతో తో రూపొందిన ఈ సినిమా దాదాపు 90 మిలీయన్ల డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.. జాన్ జి ఒవిల్డే దర్శకత్వంలో తెరకెక్కిన మార్షల్ అర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ స్కూల్ విద్యార్థి కరాటే శిక్షన కోసం ఎంత కష్టపడి అనుకున్న విజయాన్ని సాదించడనే లైన్ మీద సాగుతుంది.. ముఖ్యంగా గురు - శిష్యుల మధ్య వచ్చే సీన్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. ఇప్పటికి ఈ సినిమాని చాలా మంది ప్రేరణగా తీసుకుంటారు.. అలాంటి ఈ కథను దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
కథ లోని ప్రధాన పాత్ర దారులే తోనే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించడం విశేషం. అప్పట్లో మెయిన్ లీడ్ లో నటించిన మచియో - జాబ్కా జిబితాలు టోర్నమెంట్ ఈవెంట్స్ తర్వాత ఎలా మారాయి అనే కోణంలో కథను పొడగించి.. కథను కొంచెం వినోదాత్మకంగా తీయలనుకుంటున్నారట. 2018 లో 10 ఎపిసోడ్స్ తో కోబ్రా కాయ్ అనే టైటిల్ తో ఈ సిరీస్ రూపొందనుంది.