Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నటిని డ్రగ్ కేసులో ఇరికించేసిన బేకరి యజమాని

By:  Tupaki Desk   |   28 April 2023 10:04 AM GMT
బాలీవుడ్ నటిని డ్రగ్ కేసులో ఇరికించేసిన బేకరి యజమాని
X
ఇప్పుడు చెప్పేది ఎంతమాత్రం సినిమా కథ కాదు. నిజంగా అంటే నిజంగా జరిగిన రియల్ స్టోరీ. విన్నంతనే వణుకు పుట్టేలా ఉంటే ఈ ఉదంతంలో అడ్డంగా బుక్ అయ్యింది ఒక బాలీవుడ్ నటి. దేశం కాని దేశంలో ఆమెను డ్రగ్ కేసులో బుక్ చేసిన వైనం సంచలనమైతే.. ఆమె ఎలాంటి తప్పు చేయకున్నా ఇరికించిన విషయం మరింత షాకింగ్ గా మారింది. ఇంతకూ ఆ బాలీవుడ్ నటి ఎవరు? ఆమెను ఎవరు ఆ తరహా కేసులో ఇరికించారు? ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.

బాలీవుడ్ చిత్రా లైన బాట్లా హౌస్.. సడన్ 2లో నటించిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా నిషేధిత డ్రగ్స్ కేసులో యూఏఈ లో అరెస్టు అయ్యారు. దాదాపు మూడు వారాలకు పైనే షార్జా జైల్లో ఉన్న ఆమె తాజాగా బెయిల్ మీద విడుదలయ్యారు. త్వరలోనే ఆమె భారత్ వస్తారని చెబుతున్నారు. ఒక అంతర్జాతీయ వెబ్ సిరీస్ కు సంబంధించిన చర్చల కోసం ఆమెను షార్జా కు ఆహ్వానించారు. తనకు నిజంగానే ఆఫర్ వచ్చిందన్న ఉద్దేశంతో ఆమె షార్జా కు వెళ్లారు.

ఆడిషన్ లో బహుమతిగా ఆమెకు ఒక ట్రోఫీని ఇచ్చారు. అందులో గంజాయి.. గసగసాలను ట్రోఫీలో దాచి ఆమె చేతికి ఇచ్చారు. ఇదేమీ తెలియని ఆమె.. తన తిరుగు ప్రయాణంలో ట్రోఫీతో బయలుదేరారు. మరోవైపు ఆమె నిషేధిత డ్రగ్స్ ను తీసుకొని వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందటంతో.. ఆమె ట్రోఫీను స్వాధీనం చేసుకొని తనిఖీ చేశారు. అందులోని నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

అనూహ్య పరిణామంతో ఆమె షాక్ తిన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా.. షార్జా పోలీసులు ఆమె మాటను విశ్వసించలేదు. ఆమెను అరెస్టు చేసి జైలు కు తరలించారు. దీని పై ఆమె కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలతో పాటు.. ముంబయి క్రైం పోలీసులు రంగంలోకి దిగి అసలు మిస్టరీని చేధించారు. బాలీవుడ్ నటి క్రిసాన్ ఒక అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. అందులోనే ఉండే ఒక బేకరీ యజమాని ఆంథోనీకి.. నటికి మధ్య కుక్క విషయంలో గొడవ జరిగింది.

దీంతో బాలీవుడ్ నటి పై కుట్ర పన్నిన ఆంథోనీ ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూశాడు ఇందులో భాగంగా కన్సల్టెంట్ గా వ్యవహరించే రాజేశ్ ద్వారా క్రిసాన్ కు షార్జాలో ఒక వెబ్ సిరీస్ ఆడిషన్ కోసమని రప్పించారు. ఇవేమీ తెలియని ఆమె షార్జా కు రావటం.. ఆడిషన్ లో పాల్గొనటం.. ఆమెకు ట్రోఫీని తీసుకొని ముంబయికి వెళ్లటం కోసం ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఇదే సమయంలో.. ఆమె నిషేధిత డ్రగ్స్ తీసుకెళుతున్నట్లుగా సమాచారం ఇవ్వటం.. పోలీసులు తనిఖీ చేసి ఆమెను అరెస్టు చేశారు.

ముంబయి పోలీసుల విచారణలో ఇదే రీతిలో ఆంథోనీ.. రాజేష్ లు ఇదే తరహాలో మరో ఐదుగురిని మోసగించినట్లుగా గుర్తించారు. దీంతో.. షార్జా పోలీసులకు అందించిన సమాచారంతో పాటు.. బెయిల్ కోసం దాదాపు రూ.80లక్షలను పూచీకత్తుగా కట్టటంతో ఆమెకు బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన నటి క్రిసాన్ తన తల్లితో వీడియో కాల్ లో మాట్లాడిన సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. భారత్ కు తిరిగి రావాలన్న బల మైన ఆకాంక్ష ను ఆమె వ్యక్తం చేశారు. ఈ ఉదంతం మొత్తం తెలిసినంతనే సినిమా కథకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉందనిపించక మానదు.