Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ని పట్టిపీడిస్తున్న మహమ్మారి..!
By: Tupaki Desk | 17 April 2021 10:51 AM GMTకరోనా కారణంగా గతేడాది సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయింది. మహమ్మారి కట్టడి కోసం కొన్ని నెలల పాటు లాక్ డౌన్ విధించడంతో, చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. సినిమా షూటింగ్ లు ఆగిపోయి.. థియేటర్లు మూతపడటంతో ఇండస్ట్రీలో కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కోవిడ్ నిబంధనలతో నెమ్మదిగా సాదారణ పరిస్థితులు రావడం మొదలైంది. షూటింగ్స్ తిరిగి స్టార్ట్ అవడమే కాకుండా థియేటర్లు రీ ఓపెన్ అయ్యాయి. కరోనా తీవ్రత తగ్గడంతో 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ నుంచి 100 శాతానికి పెంచారు. టాలీవుడ్ కు ఇబ్బందేమీ లేదు అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావంమళ్ళీ మొదలైంది.
దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి చూసి ఇండస్ట్రీలో మళ్ళీ కలవరం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గతేడాది చూసిన విపత్కర పరిస్థితులు దాదాపు మళ్ళీ చూసేలా చేసింది. దీంతో అందరూ జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా ఆలోచన చేయనప్పటికీ.. జనాలు జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు చూడక తప్పేట్లు లేదు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా పెద్దలు చర్చలు మొదలు పెట్టారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే నటీనటులకు టెక్నిషియన్స్ కరోనా బారిన పడుతుబడటంతో షూటింగ్స్ ఆగిపోతున్నాయి. తాజాగా రెండు రోజులుగా 'ఆచార్య' షూటింగ్ లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు కోవిడ్ పాటిజివ్ గా నిర్ధారణ అయింది. చిరంజీవి - రామ్ చరణ్ లతో కలిసి చిత్రీకరణ చేసిన సోనూ కి కరోనా రావడంతో.. ఇప్పుడు టీమ్ మొత్తం టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పెద్ద చిత్రాల షూటింగులకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని తెలుస్తోంది. ఇక థియేటర్లలో ఆంక్షలు విధించి, సీటింగ్ కెపాసిటీని తగ్గించే అంశం మళ్ళీ చర్చకు వస్తోంది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టాలీవుడ్ లో విడుదల తేదీలని ప్రకటించిన సినిమాలను వాయిదా వేశారు. మరి టాలీవుడ్ ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కట్టడి కోసం రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.