Begin typing your search above and press return to search.
మహేష్ 2020 BANG విశాఖ ఉత్సవం లో
By: Tupaki Desk | 28 Dec 2019 5:56 AM GMTఎక్కడ క్రౌడ్ కనబడితే అక్కడ ప్రచారం చేసుకోవడం ఎలానో ఆర్జీవీకి తెలిసినంతగా ఎవరికీ తెలీదేమో! అయితే దానినే అనీల్ రావిపూడి బృందం ఫాలో చేస్తున్నట్టుంది. నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోని బీచ్ సొగసుల విశాఖ నగరం లో జరగనున్న `విశాఖ ఉత్సవ్` వేడుకల్లో సరిలేరు నీకెవ్వరు సాంగ్ ప్రోమోని రిలీజ్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ``వెల్ కం టు 2020 విత్ ఏ బ్యాంగ్. నేటి సాయంత్రం 7:02 గంటలకు #డాంగ్ డాంగ్- ది పార్టీ సాంగ్ ప్రోమో ను విశాఖ ఉత్సవం లో రిలీజ్ చేస్తున్నాం`` అని ప్రకటించారు. ఇప్పటికే సరిలేరు నుంచి దేవీశ్రీ ట్యూన్స్ ఒక్కొక్కటి గా రిలీజై మహేష్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్నాయి. సాయంత్రం రిలీజ్ కానున్న పార్టీ సాంగ్ ఏ మేరకు ఆకట్టుకోనుంది అన్నది చూడాలి.
ఇక పోతే ఈ పాటను విశాఖ ఉత్సవంలోనే రిలీజ్ చేయాలనుకోవడానికి కారణమేమిటి? అంటే.. నేటి (డిసెంబర్ 28) సాయంత్రం ఐదు గంటల నుంచి ఊక వేస్తే రాలనంత మంది విశాఖ నగరాన్ని చుట్టు ముట్టనున్నారన్న రిపోర్ట్ తాజాగా అందింది. ఈ వేడుకకు ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల నుంచి లక్షలాది గా ప్రజలు తరలిరానున్నారు. అలాగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అల్లర్లు చెలరేగినా అణచివేసేందుకు దాదాపు 2500 మంది పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. ఇక ఈ ఉత్సవం లో 24 కిలో మీటర్ల మేర హ్యూమన్ చెయిన్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం ఉత్కంఠ పెంచుతోంది. నగర విమానాశ్రయం నుంచి ఆర్కే బీచ్ వరకూ వైయస్ జగన్మోహన్ రెడ్డి విజిట్ సాగనుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీస్ పహారాను సిద్ధం చేసారు. ఏపీ రాజధాని విశాఖ నగరం అని ప్రకటించినప్పటి నుంచి యువ సీఎం జగన్ కి ఉత్తరాంధ్ర లో అసాధారణమైన ఫాలోయింగ్ పెరిగింది. ఒకే ఒక్క ప్రకటనతో రాజకీయ వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారారు. ప్రజలు జయజయధ్వానాలతో జగన్ ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో లక్షలాది మంది జనాల మధ్య సరిలేరు టీమ్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడం తెలివైన ఆలోచనే.