Begin typing your search above and press return to search.
చైతూ వెబ్ సిరీస్ పాయింట్ షాకిస్తోందిగా
By: Tupaki Desk | 4 May 2022 5:30 PM GMTవిక్రమ్.కె.కుమార్ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. అతడు తెరకెక్కించినవి కొద్ది సినిమాలే అయినా ప్రయోగాల శాతమే ఎక్కువ. వీటిలో మనం- ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. అంతకుముందు బాలీవుడ్ లో 13బి లాంటి హారర్ సినిమా తీసి మెప్పించారు. ఆ సినిమాలో అవిటివాని పాత్ర ఎంతో స్పెషల్. సీరియల్ పాత్రలతోనే భయానికి మీనింగ్ ఏంటో చూపించిన ట్యాలెంట్ విక్రమ్ ది. 13 బి చిత్రం అన్ని భాషల ఆడియెన్ కి విపరీతంగా నచ్చింది.
ఇప్పుడు అతడు మరోసారి భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారని తెలిసింది. అది కూడా అక్కినేని నాగచైతన్యతో కలిసి చేస్తున్న దూత వెబ్ సిరీస్ కోసం అతడు ఎంపిక చేసుకున్న పాయింట్ ఆద్యంతం రక్తి కట్టించనుందట.
ఇది కాస్త పారా నార్మల్ యాక్టివిటీ తరహా ఘోస్ట్ స్టోరి. ఆత్మలు కనిపించవు.. కానీ భయపెడతాయి. పగ తీర్చుకుంటాయి. చంపుతాయి. చైతూ కుటుంబం కూడా ఆత్మల భారిన పడుతుంది. అయితే అతడు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏం చేసాడన్నది ఆసక్తికరంగా చూపిస్తున్నారట.
సహజంగానే క్రైమ్ .. హారర్ జానర్ అంటే పోలీసుల పాత్ర ఉంటుంది. మరి ఆత్మలు చేసే మర్డర్లను ఇన్వెస్టిగేట్ చేయడం ఎలా? చివరికి నేరస్తుడిని పట్టుకున్నారా? అంటే అక్కడే ఉంది అసలు ట్విస్టు.
అసలు నేరస్తుడు అనేవాడే ఉండడు. కేవలం వస్తువులు పగ తీర్చుకుంటాయి. నిర్జీవమైన వస్తువుల్ని అరెస్ట్ చేయడం కుదరదు కదా! అయితే ఇక్కడ పారా నార్మల్ యాక్టివిటీ ఎలిమెంట్ ని విక్రమ్ కె ఉపయోగించుకుంటున్నారట.
ఏది ఏమైనా ప్రతిభావంతమైన దర్శకుడు విక్రమ్.కె కుమార్. చైతన్యకు మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చాక థాంక్యూ అనే సినిమా చేసాడు. ఇప్పుడు దూత వెబ్ సిరీస్ తో చైతూకి వెబ్ ప్రపంచంలోనూ మరో లెవల్ చూపించాలని తపిస్తున్నాడు.