Begin typing your search above and press return to search.
చరణ్ వాచ్ ఖరీదు నిజంగా 'రూ. కోటి'నా?
By: Tupaki Desk | 10 Sep 2021 6:10 AM GMTసెలబ్రెటీలు ధరించే ప్రతి కాస్ట్యూమ్ మరియు వాడే గాడ్జెట్స్ ఇంకా వాహనాలు అన్ని కూడా అంతర్జాతీయ స్థాయి బ్రాండ్స్ అయ్యి ఉంటాయి. ముఖ్యంగా స్టార్స్ వినియోగించే వస్తువులు మరియు ఇతరం అన్ని కూడా వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న బ్రాండ్స్ ను మాత్రమే సెలబ్రెటీలు వినియోగిస్తారు అనడంలో సందేహం లేదు. చెప్పుల నుండి మొదలుకుని మొబైల్ వరకు ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడ్ ఉండేలా వారు చూసుకుంటారు. వారి స్టార్ స్టేటస్ కు తగ్గట్లుగా అంతకు మించి అన్నట్లుగా ఉండేలా వారు గాడ్జెట్స్ ను వినియోగిస్తూ ఉంటారు. తాజాగా రామ్ చరణ్ చేతికి పెట్టుకుని ఉన్న వాచ్ గురించి చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆ వాచ్ ఖరీదు కోటి రూపాయలకు పైగా ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ఆ పూజా కార్యక్రమాల్లో చరణ్ ధరించిన వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్లాక్ బెల్ట్ మరియు ఎల్లో మరియు గ్రీన్ కలర్ లో డయల్ ఉంది. చాలా ప్రత్యేకంగా కనిపించిన ఈ వాచ్ గురించి కొందరు ఔత్సాహికులు నెట్ లో సెర్చ్ చేయగా ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి. ఈ వాచ్ ను ప్రపంచ ప్రసిద్ది గాంచిన రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ మోడల్ గా వెళ్లడి అయ్యింది. ఈ వాచ్ ను గతంలో ఒలింపిక్స్ లో 100 మరియు 200 మీటర్ల పరుగు పందెంలో ఫాస్టెస్ట్ రన్నర్ గా నిలిచిన యోహన్ బ్లేక్ పేరు మీద ఈ వాచ్ ను రూపొందించారు. అతడి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వాచ్ కు ఆ తర్వాత అనూహ్యంగా మార్కెట్ లో డిమాండ్ ఏర్పడింది.
మార్కెట్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వాచ్ ధర 1.25లక్షల యూరోలుగా చెబుతున్నాఉ. అంటే ఇండియన్ మార్కెట్ లో దీని ధర రూ 1.08 కోట్లుగా చెబుతున్నారు. ఒక వాచ్ ఖరీదు కోటికి పైగా ఉంటుందా అనే అనుమానంను కొందరు వ్యక్తం చేస్తుంటే.. అంత క్లీయర్ గా నెట్ లో కనిపిస్తుంది కనుక నమ్మక తప్పడం లేదు అంటున్నారు. అయితే చరణ్ ధరించిన వాచ్ ఒరిజినల్ అయ్యి ఉంటుందా లేదా దాని కాపీ నా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ స్థాయికి కాపీ పెట్టాల్సిన అవసడం లేదు. ఆయన హోదాకు ఆయన ఆస్తికి కోటి రూపాయల వాచ్ పెద్ద సమస్య కాదు.
ఆయన ఏదో ఒక బర్త్ డే కు లేదా ఏదో ఒక సందర్బంలో తన కుటుంబ సభ్యులు లేదా భార్య ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చి ఉంటుంది. లేదా తానే ఇష్టంతో కొనుక్కుని ఉంటాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మొత్తానికి చరణ్ యొక్క వాచ్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా నిలిచింది. ఒక్కో సినిమాకు యాబై కోట్లకు పైగా పారితోషికం తీసుకునే హీరోకు కోటి రూపాయల వాచ్ ఉండటం పెద్ద అతిశయోక్తి అస్సలు కాదు అనేది మెగా ఫ్యాన్స్ టాక్.