Begin typing your search above and press return to search.

జాతిర‌త్నం వెంట ప‌డుతున్న నిర్మాత‌లు ఒక‌రు బుక్ చేసేశారు కూడా!

By:  Tupaki Desk   |   18 March 2021 3:30 PM GMT
జాతిర‌త్నం వెంట ప‌డుతున్న నిర్మాత‌లు ఒక‌రు బుక్ చేసేశారు కూడా!
X
యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. 'జాతి రత్నాలు' సినిమాతో ఊహించ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డంతో ఇండ‌స్ట్రీ స్పాట్ లైట్ మొత్తం న‌వీన్ పైనే ఫోక‌స్ చేస్తోంది. ఈ చిత్రం సాధించిన విజ‌యం మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు వ‌చ్చేసిన ఈ మూవీ.. ఓవ‌ర్సీస్ లో కొల్లగొడుతున్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ అనలిస్టులు కూడా నోరెళ్లబెడుతున్నారు.

వంద కోట్ల సినిమాగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన 'ఉప్పెన' కూడా సాధించ‌లేక‌పోయిన క‌లెక్ష‌న్స్ ను విదేశాల్లో 'జాతిరత్నాలు' రాబడుతుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. హాఫ్ మిలియన్ డాలర్స్ ఎప్పడో క్రాస్ చేసిన ఈ చిత్రం.. లాంగ్ రన్ లో మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి తీరుతుందని ధీమాగా చెబుతున్నారు.

'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో మంచి హిట్ కొట్టిన నవీన్.. ఇప్పుడు జాతి ర‌త్నాలు సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకోవ‌డంతో మేక‌ర్స్ చూపు ఈ యంగ్ హీరోపైనే ప‌డింది. ప్ర‌ముఖ బ్యాన‌ర్లు కూడా న‌వీన్ తో సినిమా చేయ‌డానికి ఆరాట‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఒక‌రితో సినిమా చేయ‌డానికి సైన్ కూడా చేశాడ‌ట న‌వీన్‌.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ మేర‌కు న‌వీన్ తో అగ్రిమెంట్ కూడా తీసుకున్నాడ‌ట‌. ఇప్పుడు స్టోరీ దొర‌క‌డ‌మే ఆల‌స్య‌మ‌ని టాక్‌. మంచి స్క్రిప్టు దొర‌గ్గానే.. సినిమా సెట్స్ మీద‌కు వెళ్లిపోతుంద‌ట‌. మ‌రి, ఏ ద‌ర్శ‌కుడితో, ఎలాంటి జోన‌ర్ లో దిల్ రాజు - న‌వీన్ సినిమా వ‌స్తుందో చూడాలి.