Begin typing your search above and press return to search.
పిఎస్-1 ఆ మార్క్ దాటింది.. కానీ..!
By: Tupaki Desk | 19 Nov 2022 5:07 AM GMTఎన్నో ఏళ్లుగా పొన్నియిన్ సెల్వన్ నవలను సినిమాగా చేయాలని ప్రయత్నాలు సాగించగా ఫైనల్ గా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమా చేశారు. విక్రం, కార్తీ, జయం రవి లాంటి స్టార్స్ ని పెట్టుకుని మణిరత్నం చాలా పెద్ద సాహసమే చేశారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. పిఎస్ 1 పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 30న రిలీజైంది. తమిళంతో పాటుగా తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో రిలీజైనా సరే ఒక్క తమిళంలోనే సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో సూపర్ హిట్ అవుతుందని ఆశించినా ఎందుకో పిఎస్ 1 ఇక్కడ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
తమిళ ఫ్లేవర్ ఎక్కువ కనిపించడంతో మన ఆడియన్స్ పెదవి విరిచారు. పిఎస్ 1 తెలుగు రిజల్ట్ పై తమిళ ఆడియన్స్ ట్రోల్స్ కూడా చేసిన విషయం తెలిసిందే. తెలుగు ఆడియన్స్ కి సినిమా నచ్చితే ఎలాంటి సినిమా అయినా హిట్ చేస్తారు.. కానీ పిఎస్ 1 ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
తెలుగులోనే కాదు తమిళంలో తప్ప రిలీజైన మిగతా అన్ని భాషల్లో ఇది నిరాశపరచింది. ఇక 50 రోజులు పూర్తి చేసుకున్న పిఎస్ 1 సినిమా 500 కోట్ల మార్క్ ని దాటేసింది. పిఎస్ 1 ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా 50 రోజుల్లో 500 కోట్ల పైన వసూళ్లు రాబట్టింది అని ఎనౌన్స్ చేశారు.
పిఎస్ 1 సక్సెస్ పై విక్రం ఇది నిజమేనా.. నన్ను ఎవరైనా వచ్చి గిల్లండి అంటూ ట్వీట్ చేశాడు. రాజ రాజ చోళ కథతో పిఎస్ 1 ఎన్నో భారీ అంచనాలతో వచ్చింది. అక్కడ స్టార్స్ కాబట్టి తమిళ ఆడియన్స్ సినిమాకు బాగానే కనెక్ట్ అయినా మిగతా భాషల్లో మాత్రం సినిమా సక్సెస్ అందుకోలేదు. సినిమాలో అందాల భామలు ఐశ్వర్య రాయ్, త్రిష కృష్ణన్ లు నటించారు. ఈ సినిమాలో త్రిష లుక్స్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి.
మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. పిఎస్ 2 షూటింగ్ కూడా పూర్తి కాగా 2023 సమ్మర్ లో పిఎస్ 2 రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మరి పిఎస్ 2 అయినా కేవలం తమిళ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా పాన్ ఇండియా ఆడియన్స్ ని అలరిస్తుందేమో చూడాలి.
పిఎస్ 1లో జరిగిన తప్పులని సరిదిద్దుకొని పిఎస్ 2 అంచనాలను అందుకునేలా ప్లాన్ చేస్తున్నారు మణిరత్నం. ఈ ఏడాది రిలీజైన ఆర్.ఆర్.ఆర్, కె.జి.ఎఫ్ 2 సినిమాలు 1000 కోట్ల మార్క్ దాటగా పిఎస్ 1 మాత్రం 500 కోట్లకే సరిపెట్టుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.