Begin typing your search above and press return to search.

సోను గడ్డం కోసం స్క్రిప్ట్ మార్చారట!

By:  Tupaki Desk   |   29 Aug 2018 1:30 AM GMT
సోను గడ్డం కోసం స్క్రిప్ట్ మార్చారట!
X
పాత సినిమాలు అందులోనూ జానపద చిత్రాలు చూసే తెలుగు సినిమా అభిమానులకు దర్శకుడు విఠాలాచార్య పేరు పరిచయమే. 'జగన్మోహిని' లాంటి ఎన్నో మాయలు మంత్రాలు ఉండే సినిమాలను డైరెక్ట్ చేసిన ఆయన గురించి ఒక విషయం ప్రముఖంగా చెప్తారు. అదేంటంటే.. అయన సినిమా షూటింగ్ కు ఎవరైనా నటుడు కనుక రాలేదంటే ఆ నటుడిని కుక్కగానో పిల్లిగానో మార్చేస్తాడట. అంటే.. ఏదో శాపం తగిలిందని చూపించిన్ ఆ సీన్స్ ను ఏ కుక్కతోనో - పిల్లితోనో లాగిస్తాడు గురువురుగారు. ఇప్పుడైతే అయన పప్పులు ఉడికేవి కాదులేండి.. యానిమల్ రైట్స్ అని - మరోటని విఠలాచార్యను ఏడిపించి ఉండేవారు.

ఏదేమైనా షూటింగ్ కి ఇబ్బంది రాకుండా స్క్రిప్ట్ ను మార్చడం ఎప్పటినుంచో జరుగుతున్న వ్యవహారమే. అప్పటి విఠాలాచార్య కాలం నుండి ఇప్పటి క్రిష్ కాలం వరకూ అది జరుగుతూనే ఉంది. తాజాగా 'మణికర్ణిక' సినిమా స్క్రిప్ట్ లో నటుడు సోను సూద్ కోసం ఇలాంటి చిన్న ఛేంజ్ చేయాల్సి వచ్చిందట. 'అరుంధతి' సినిమాలో అఘోర క్యారెక్టర్ లో అందరినీ జడుసుకునేలా చేసిన సోను ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అయన పాత్ర క్లీన్ షేవ్ లో ఉంటుందట. కాకపొతే.. సోను ఈమధ్య మరో బాలీవుడ్ సినిమా 'సింబా' కోసం గెడ్డాన్ని పెంచాల్సి వచ్చింది. మరి ఆ గెడ్డంతో 'మణికర్ణిక' లో యాక్ట్ చేస్తే కంటిన్యుటి దెబ్బతింటుంది కదా. అందుకే స్క్రిప్ట్ ను కొంచెం మార్చారట.

ఈ విషయాన్నీ సోనునే వెల్లడించడం విశేషం. ఈ సినిమాలో ఒక యోధుడి పాత్రలో కనిపించే తను ఒక రెండేళ్ళ తర్వాత గెడ్డంతో తిరిగివచ్చేలా మార్పు చేయడం జరిగిందట. పోన్లెండి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే.. లేదంటే ఆడియన్స్ అందరూ 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్ ను గుర్తు తెచ్చుకునేవారు!