Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ని ఇరకాటంలో పెట్టేసిన ప్రశ్న!
By: Tupaki Desk | 12 Jan 2023 2:30 PM GMTతెలుగు తమిళ సినీపరిశ్రమలతో పాటు హిందీ చిత్రసీమలోను స్టార్ల పారితోషికం గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. బడ్జెట్ లో మెజారిటీ వాటాను పారితోషికంగా అందుకునే స్టార్ల వల్లనే నిర్మాతలకు ఇన్ని కష్టాలు అని కూడా వాపోతుంటారు. దాసరి లాంటి పలువురు నోరున్న పెద్దలు బహిరంగంగానే హీరోల తీరుతెన్నులను విమర్శించారు. కానీ హీరోల పారితోషికాలు తగ్గాయా? అంటే ఇప్పటికీ కొండెక్కి కూచున్నాయనే చెబుతారు. అసలు సినిమా అంటేనే హీరో .. హీరో ఉంటేనే సినిమా! అన్న తీరుగా పరిశ్రమ ఉంది.
కానీ బహిరంగ వేదికలపై తమ నిర్మాతల గొప్పతనం గురించి పొగిడేసే హీరోలు ఎప్పటికీ తమ పారితోషికాల్ని తగ్గించుకోరు. సరికదా ఏదైనా సినిమా హిట్టు కొడితే చాలు.. వెంటనే పారితోషికం పెంచేస్తారు. ఎందుకిలా చేస్తారు? అని ప్రశ్నిస్తే తమకు పబ్లిక్ లో ఉన్న డిమాండ్ మేరకు వసూలు చేస్తున్నామని అంటారు.
తాజాగా ఓ టీవీ చానెల్ యాంకర్ నేరుగా మెగాస్టార్ చిరంజీవి పైనే గురి చూసి ఇలాంటి ఒక ప్రశ్నను సంధించారు. నిర్మాతల మేలు కోరే మీరు పారితోషికం తగ్గించుకుంటారా? అని ప్రశ్నించగా దానికి మెగాస్టార్ ఇచ్చిన ఆన్సర్ షాకిచ్చింది.
ఒక స్టార్ తనకు ఉన్న డిమాండ్ మేరకే పారితోషికం తీసుకుంటాడు. అందుకు ఆ స్టార్ అర్హుడు. అయితే ఎక్కడా నిర్మాత డబ్బు వృథా కాకూడదు. ఒక ఫైట్ సీన్ తీయాలంటే రోజుకు 45-50 లక్షలు ఖర్చవుతుందని లెక్క చెబుతారు. అలాంటప్పుడు ఒక రోజు పోయినా ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది. అది దర్శకుని ప్లానింగ్ తోనే ఏదైనా ఉంటుంది. నాలుగైదు రోజుల షూట్ టైమ్ తగ్గించుకోగలిగితే చాలు చాలా లాభం తెచ్చిన వారవుతారు.
కనీసం 2-3 కోట్లు అక్కడే నిర్మాత ఖర్చు నుంచి తగ్గుతాయి. 4-5 గంటలు సినిమా తీసి.. పార్ట్ 2 తీస్తారా లేదా కామ్ గా దానిని ఎక్కడో చుట్టేసి వదిలేస్తారా? అన్నది ఎవరికీ తెలీదు. నిజానికి పేపర్ మీద ఉండగానే బడ్జెట్ ని ఎంతగా తగ్గించుకోవాలి? అన్నదానిపై కసరత్తు చేయాలి. దాంతోనే సగం విజయం సాధించినట్టు! అని మెగాస్టార్ అన్నారు. ఒక బెస్ట్ స్టోరీ తీయడం కాదు వితిన్ ది టైమ్ తీయగలిగితే అదే మొదటి సక్సెస్ అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
మైత్రి నిర్మాతల ధైర్యం గురించి ప్రస్తావిస్తూ... ఒకే నిర్మాణ సంస్థ రెండు పెద్ద సినిమాల్ని ఒకే పండక్కి తెస్తోంది. రిస్కుతో కూడుకున్నదే కానీ ఆ నిర్మాతలు చాలా కూల్ గా ఉన్నారు. రెండూ హిట్టవుతాయని ధీమాతో ఉన్నారు. బయ్యర్లు సహా అందరినీ దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఈ సినిమాలను చేశారు. అయినా పండగకు రెండు మూడు సినిమాలను తీసుకునే సత్తా ఉంది. జనాదరణ దక్కుతుందని చిరు అన్నారు.
నిర్మాత కష్టం గురించి మాట్లాడతారు.. పారితోషికంలో తగ్గలేరా? అని ప్రశ్నించగా.. ఇమేజ్ కి తగ్గట్టు హీరోలు లయన్ షేర్ తీసుకోవడం తప్పు కాదు. కానీ అంతా నేనే అనకుండా అందరి గురించి ఆలోచించి తీసుకోవాలి. తనతో పాటు పదిమంది బతకాలని హీరోలు ఆలోచించాలని కూడా చిరంజీవి సూచించారు. తాను అలానే చేశానని తన కెరీర్ ని గుర్తు చేసుకున్నారు. హీరోలు తమ స్థాయిని బట్టే పారితోషికం అందుకుంటారని .. డిమాండ్ సప్లయ్ సూత్రం ప్రకారమే ఇది జరుగుతుందని వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.