Begin typing your search above and press return to search.
ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలో వీటిదే హంగామా!
By: Tupaki Desk | 7 Sep 2022 7:30 AM GMTఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీ వేదికగా బ్యాక్ టు భారీ పోటీ జరగబోతోంది. ఈ వారం థియేటర్లలో భారీ పాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న రాబోతోంది. దీన్ని తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతోనూ విడుదల విడుదల చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. ఇక ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు క్రేజీ వెబ్ సిరీస్ లు కూడా పోటీపడుతుండటం విశేషం.
ఈ వీకెండ్ లో థియేటర్లలో.. ఓటీటీలో రిలీజ్ అవుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ల గురించి ఓ లుక్కేద్దాం. థియేటర్లలో డబ్బింగ్ సినిమాలతో పాటు డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. అందులో చెప్పుకోదగ్గ మూవీ 'ఒకే ఒక జీవితం'. శర్వానంద్ నటించాడు. సెప్టెంబర్ 8న ఆర్య నటించిన తమిళ డబ్బింగ్ మూవీ 'కెప్టెన్' రిలీజ్ అవుతోంది. ప్రెడేటర్ కథతో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ గా ఈ మూవీని నిర్మించారు. శక్తి సౌందర్ రాజన్ రూపొందించిన ఈ మూవీని నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఇదే రోజు 'ఒట్టు' పేరుతో రూపొందిన మలయాళ మూవీ రిలీజ్ అవుతోంది. తమిళంలో 'రెండగం' పేరుతోనూ విడుదల కానుంది. కుంచకో బోబన్, అరవింద్ స్వామి, ఈషారెబ్బ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 9న భారీ స్థాయిలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించిన 'బ్రహ్మాస్త్రం' మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇదే రోజు శర్వానంద్ నటించిన 'ఒకే ఒక జీవితం' రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకే సారి రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతోంది.
ఇక ఇదే రోజు కొత్త జంట నటించిన 'కొత్త కొత్తగా' థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఇదే రోజున 'లక్కీ మ్యాన్' రాబోతోంది. వీటితో పాటు ఓటీటీలోనూ భారీగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 9న హన్సిక నటించి 'మహా' మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో జూలైలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీలో అయినా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఇక సెప్టెంబర్ 11 నుంచి ఇదే ఆహా ఓటీటీలో 'డ్యాన్స్ ఐకాన్' స్ట్రీమింగ్ కాబోతోంది.
నెట్ ఫ్లిక్స్ లో దాదాపు పది సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇండియన్ ప్రిడేటర్ : ది డైరీ ఆఫ్ ఏ సీరియల్ కిల్లర్ సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీంగ్ అవుతోంది. చెఫ్ టేబుల్ : పిజ్జా, ఎంట్రాప్ట్ సెప్టెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. కోబ్రా కై సీజన్ 5, నో లిమిట్, ఏక్ విలన్ రిటర్న్స్ , ఎండ్ ఆఫ్ ద రోడ్, నాక్రో - సెయింట్స్, డియో రమా సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. 'తాళ్లుమాల' సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో దుల్కర్ సల్మాన్ నటించిన 'సీతా రామం' సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 8 నుంచి 'థోర్ : లవ్ అండ్ థండర్', నా, థన్ కేస్ కుడు, కార్స్ ఆన్ ద రోడ్, గ్రోయింగ్ అప్, ఓబీ వాన్ కెనొబి: ఏ జోడీస్ రిటర్న్, వెడ్డింగ్ సీజన్ స్ట్రీమింగ్ కానున్నాయి. జీ 5లో పాప్పన్ సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.