Begin typing your search above and press return to search.
కీర్తి సురేష్ ఎఫెక్ట్.. హిట్ మూవీ కంటే ప్లాప్ మూవీకి రేటింగ్ ఎక్కువ
By: Tupaki Desk | 2 July 2021 4:12 AM GMTఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కంటెంట్ ఉంటేనే నడుస్తుంది. థియేటర్లలో వసూళ్లు దక్కించుకోవాలంటే సూపర్ స్టార్ మూవీ అయినా ఖచ్చితంగా మంచి కంటెంట్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండాల్సిందే. అప్పుడే థియేటర్లలో కోట్ల వర్షం కురుస్తుంది. కాని శాటిలైట్ విషయానికి వస్తే స్టార్ కాస్ట్ అనుసారంగానే రేటింగ్ వస్తుంది. థియేటర్లలో ఆకట్టుకోలేని సినిమా లు కూడా బుల్లి తెర పై మంచి రేటింగ్ సాధించిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మహేష్ బాబు నటించిన అతడు మరియు ఖలేజా లు థియేటర్లలో నిరాశ పర్చినా కూడా బుల్లి తెరపై ఇప్పటికి మంచి రేటింగ్ ను దక్కించుకుంటూనే ఉంటుంది.
కారణం మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ అనడంలో సందేహం లేదు. ఇద్దరి కాంబోకు ఒక మంచి బజ్ ఉంది. అందుకే ఆ సినిమా లను ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని సినిమా లు కూడా టీవీల్లో పదుల సార్లు వచ్చినా కూడా మంచి రేటింగ్ వస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదల అయిన నితిన్.. కీర్తి సురేష్ రంగ్ దే సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది. పెద్దగా ఆకట్టుకోలేక పోయిన రంగ్ దే ఇటీవల జీ తెలుగు లో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు 7.22 రేటింగ్ దక్కింది. ఇతర పెద్ద సినిమాలతో పోల్చితే ఈ రేటింగ్ తక్కువే అయినా నితిన్ సినిమా ల్లో ఇది భారీ రేటింగ్ మూవీగా చెప్పుకోవచ్చు.
గత ఏడాది విడుదల అయిన కొన్ని సినిమాల్లో భీష్మ ఒకటి. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది సూపర్ హిట్ జాబితాలో భీష్మ చోటు దక్కించుకుంది. అలాంటి భీష్మ కు బుల్లి తెరపై మొదటి సారి టెలికాస్ట్ చేసిన సమయంలో అటు ఇటుగా 6.5 రేటింగ్ మాత్రమే వచ్చింది. భీష్మ కంటే ఇప్పుడు రంగ్ దే సినిమాకు ఎక్కువ రేటింగ్ రావడం ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రంగ్ దే సినిమాకు అత్యధిక రేటింగ్ వచ్చిన విషయంలో ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది కూడా రంగ్ దే సినిమా లో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ నటించడం వల్లే ఆ స్థాయి రేటింగ్ వచ్చిందని అంటున్నారు. మహా నటి తర్వాత ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది.
ఆమె నటించిన సినిమాలు అన్ని కూడా బుల్లి తెరపై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ కారణంగా మంచి రేటింగ్ ను దక్కించుకుంటున్నాయి. రంగ్ దే సినిమా లో కీర్తి సురేష్ నటించడం వల్లే అంత రేటింగ్ సాధించిందని కొందరి అభిప్రాయం. మరి కొందరు మాత్రం రంగ్ దే సినిమా ను థియేటర్లలో చూసే వీలు ఎక్కువ మందికి దక్కలేదు. పైగా జీ తెలుగు లో ఆ సినిమా టెలికాస్ట్ అయిన సమయంలో ఇతర ఛానెల్స్ లో క్రేజీ మూవీస్ ఏమీ లేవని అందుకే ఆ రేటింగ్ దక్కించుకుని ఉంటుందని అంటున్నారు. లాక్ డౌన్ టైమ్ అవ్వడం వల్ల ప్రతి సినిమాకు కూడా మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుందని మరి కొందరి విశ్లేషణ. మొత్తానికి నితిన్ రంగ్ దే బుల్లి తెరపై మంచి ప్రభావం అయితే చూపించింది.