Begin typing your search above and press return to search.

వాటికోసమే ఒక వెబ్ సైట్ పెట్టిన రియల్ హీరో

By:  Tupaki Desk   |   13 Jun 2021 8:30 AM GMT
వాటికోసమే ఒక వెబ్ సైట్ పెట్టిన రియల్ హీరో
X
రీల్ లైఫ్ ద్వారా ఫోకస్ అయి రియల్ లైఫ్ లో కష్టకాలంలో జనాలను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్న సోనుసూద్ టాక్ ఆఫ్ ది కంట్రి అయిపోయారు. కరోనా వైరస్ మొదటివిడతలో మొదలైన సోను సూద్ ప్రజాసేవ నిరంతరాయంగా సాగుతునే ఉంది. తాజాగా దేశంలో ఎక్కడ ఎవరికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అవసరమైనా తనకు తెలియజేస్తే వెంటనే కొరియర్ ద్వారా అందచేస్తానని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తాజాగా తెలుగురాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

మొదటి విడత కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో కోట్లాదిమంది వలసకూలీలు, పేదప్రజలు నానా అవస్తలు పడిన సంగతి అందరికీ తెలిసిందే. కోట్లాది జనాలకష్టాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడి హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటిస్తే వారిని ఆదుకున్నది సూనుసూదే. వేలాదిమంది వలసకూలీలు తమ సొంతూర్లకు వెళ్ళటానికి సొంతడబ్బులతో రైళ్ళు, బస్సులను వేయించారు. అలాగే తిండిలేక అల్లాడిపోతున్న వేలాదిమంది పేదలకు నెలల తరబడి ఆకలి తీర్చారు.

రాత్రనకా, పగలనకా పేదలకు సేవ చేయటం ద్వారా అప్పట్లోనే సూద్ నిజమైన హీరో అనిపించుకున్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ యావత్ దేశాన్ని ఏ స్ధాయిలో సంక్షోభంలోకి నెట్టోస్తోందో అందరు చూస్తున్నదే. దాంతో తన సేవా కార్యక్రమాలను సోను కంటిన్యు చేస్తునేఉన్నారు. అవసరం అని అడిగిన వారికి ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చారు. కొన్ని జిల్లాల్లో ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్లే ఏర్పాటు చేయించారు.

అవసరమైన వారికి పీపీఇ కిట్లు, మాస్కులు అందించారు. అత్యవసరమైన రోగులకు మెరుగైన వైద్యం కోసం చివరకు అద్దెకు విమానాలు తీసుకుని తరలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో చిక్కుక్కున్న వారిని రప్పించేందుకు ప్రత్యేకంగా విమానాలు వేయించారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించేందుకు
www.umeedbysonusood.com
వెట్ సైట్ ఏర్పాటుచేశారు. ఆక్సిజన్ అందక ఎవరు చనిపోకూడదన్న కారణంతోనే అవసరమైన రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేకంగా అనే వెబ్ సైట్ ప్రారంభించారు.

సోనూసూద్ చారిటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ లాంటి 18 ప్రాంతాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఎంత తక్కువ వేసుకున్నో ఒక్కోదానికి కనీసం రు. కోటి రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అలాగే ఐఏఎస్ శిక్షణ తీసుకుని పరీక్షలు రాయాలనుకున్న వారికి కోచింగ్ సెంటర్ నిర్వహించాలని అనుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సంభవం అనే పేరుతో కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. సూద్ చారిటి ఫౌండేషన్. ఆర్గ్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోమన్నారు. మొత్తానికి రీల్ లైఫ్ లో విలన్ వేషాలు వేసే సోనుసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నారు.