Begin typing your search above and press return to search.
లస్ట్ స్టోరీస్ పై భళ్లున పేలిన నిజం
By: Tupaki Desk | 5 Nov 2019 9:29 AM GMTగత కొంతకాలంగా 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. సందీప్ వంగా-తరుణ్ భాస్కర్-సంకల్ప్ రెడ్డి తదితరులతో కలిసి నందిని రెడ్డి ఈ లస్ట్ స్టోరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారని .. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ఈ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలుగులోనూ రీమేక్ చేస్తోందని ప్రచారం దంచేస్తున్నారు. అయితే ఇది నిజమా? అంటే ససేమిరా అనేస్తున్నారు నందిని రెడ్డి.
అసలు ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదని నందిని రెడ్డి ఇదివరకూ ఓసారి ఖండించారు. నెట్ ఫ్లిక్స్ ఎందుకు లస్ట్ స్టోరీస్ ని తెలుగులో తీస్తది? ఆల్రెడీ సబ్ టైటిల్స్ తో వచ్చేసిన దానిని తిరిగి రీమేక్ ఎందుకు చేస్తారు? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు నందిని రెడ్డి. లస్ట్ స్టోరీస్ ని తెలుగులో తీయడం లేదు. హిందీలో కనిపించిన ఏ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ లో కనిపించదు. మేం చేసేది డిఫరెంట్ స్టోరీస్. అవి లస్ట్ స్టోరీస్ కావు అంటూ మరోసారి నందిని రెడ్డి స్పష్టతనిచ్చారు.
ఇటీవలే అమలాపాల్ తో నందిని రెడ్డి పార్ట్ చిత్రీకరణ ముగించేశారట. నందిని తీస్తున్న వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న మాట వాస్తవమే. కానీ అది లస్ట్ స్టోరీస్ మాత్రం కానే కాదని తన మాటల్ని బట్టి అర్థమవుతోంది. నందిని రెడ్డి సహా ఇతర యువదర్శకులు ఒక్కొక్కరూ ఒక్కో కొత్త కథతో సినిమా తీస్తున్నారు. వాటన్నిటికీ ఒకదానితో ఒకటిగా అర్థవంతమైన కనెక్టివిటీ ఉంటుందన్నమాట. లస్ట్ స్టోరీస్ తరహాలోనే ఇదో డిఫరెంట్ కథలతో చేస్తున్న నిక్ ప్రయత్నమని నందిని రెడ్డి మాటల్ని బట్టి భావించాల్సి ఉంటుంది.