Begin typing your search above and press return to search.
బాలీవుడ్ మాఫియా అంటూ ఎటాక్ వెనక రీజన్?
By: Tupaki Desk | 21 Feb 2022 1:30 AM GMTబాలీవుడ్ లో మాఫియా రాజ్యమేలుతోందనేది క్వీన్ కంగన రనౌత్ ప్రధాన ఆరోపణ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం తర్వాత తనని తాను సమర్ధించుకుంటూ తన వాదనను మరింత బలంగా వినిపించింది కంగన రనౌత్. అసలు ముంబై పరిశ్రమలో మనుగడ సాగించాలంటే మాఫియా కనుసన్నల్లో మెలగాల్సిందేనని కొత్త వారు బయటి వారు ఇక్కడ రాణించలేరని కూడా కంగన తీవ్రంగా మాఫియాని ఎటాక్ చేసింది. ఆ తర్వాత దీనిపై దేశవ్యాప్తంగా ఎంతో చర్చ సాగింది. ఇక రోషన్ లు.. భట్స్ జోహార్ భన్సాలీలంటే ఎంతగా మండి పడిపోతుందో తెలిసిందే.
ముఖ్యంగా ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ పై ఎన్నోసార్లు కంగన చెలరేగింది. సినిమా పరిశ్రమలో పని సంస్కృతిని ఏకంగా నాశనం చేసిన మేకర్ మహేష్ భట్ అంటూ ఎటాక్ చేసింది. అతడిని బాలీవుడ్ మాఫియా డాడీ అని పిలుస్తూ తన ఘర్షణను కొనసాగించింది. ``అతను చాలా మంది పెద్ద దర్శకులను మానసికంగా మానిప్యులేట్ చేసాడు.
వారి సినిమాటిక్ మెరుపుపై తన సాధారణ ఉత్పత్తులను బలవంతంగా రుద్దాడు. గంగూభాయి కతియావాడీ మరో ఉదాహరణ. ఈ విడుదల తర్వాత త్వరలో మరొక ఉదాహరణను కూడా మీరంతా చూస్తారు!`` అంటూ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది. గంగూభాయి కతియావాడీ రాంగ్ కాస్టింగ్ అని.. 200 కోట్లు బూడిదలో పోసినట్టేనని కంగన భట్స్ క్యాంప్ ని తీవ్రంగా ఎటాక్ చేసింది.
ప్రజలు భట్స్ క్యాంప్ ని అలరించడం మానేయాలని కూడా సూచించింది కంగన. ఈ శుక్రవారం విడుదలలో పెద్ద హీరో.. గొప్ప దర్శకుడు కూడా మహేష్ భట్ అవకతవకలకు కొత్త బాధితులు అంటూ విమర్శించింది. ఇక కరణ్ జోహార్ సహా భట్స్ ని కంగన ఏనాడూ విడిచిపెట్టదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గంగూభాయి ఫ్లాప్ అవుతుందని ఘంటాపథంగా చెబుతోంది.
కంగన విమర్వ అనంతరం ఒక చిన్న అమ్మాయి వైరల్ వీడియోను సంచలనంగా మారింది. ఆ అమ్మాయి గంగూబాయి కతియావాడి నుండి అలియా భట్ రూపాన్ని రీక్రియేట్ చేసింది.
దీనిపై కంగనా ఇన్ స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఇలా రాసింది. ``ఈ చిన్నారి నోటిలో బీడీ పెట్టుకుని పచ్చి అసభ్యకరమైన డైలాగులతో సెక్స్ వర్కర్ ని అనుకరించాలా? ఆమె బాడీ లాంగ్వేజ్ చ…`` అంటూ తిట్టేసింది కంగన. అయితే చిన్నారి వీడియోని అడ్డు పెట్టుకుని ఆలియాని తిట్టాలా? అంటూ కంగనపై నెటిజనుల ప్రశ్నలు కురుస్తున్నాయి. ఇప్పటికే గంగూభాయి కతియావాడీ ట్రైలర్ ఆలియా అభిమానులకు ప్రజలకు నచ్చింది. భన్సాలీ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. కానీ అందుకు భిన్నంగా కంగన విమర్శలు ఉన్నాయి. మరి కంగన జోశ్యం ఫలిస్తుందా? ఆలియా ఛరిష్మా నెగ్గుతుందా? అన్నది వేచి చూడాలి.