Begin typing your search above and press return to search.

నాలో ఈ మార్పుకు కారణం.. నా బాయ్ ఫ్రెండే: కుర్రహీరోయిన్

By:  Tupaki Desk   |   23 Jun 2021 2:30 AM GMT
నాలో ఈ మార్పుకు కారణం.. నా బాయ్ ఫ్రెండే: కుర్రహీరోయిన్
X
సినీఇండస్ట్రీలో అప్పుడప్పుడు సర్ప్రైజులు ఎదురవుతుంటాయి. అప్పటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కనిపించిన అమ్మాయిలు కొంతకాలం తర్వాత హీరోయిన్స్ గా మారి షాకిస్తుంటారు. హిందీ డబ్బింగ్ సీరియల్ 'చిన్నారి పెళ్ళి కూతురు'తో తెలుగునాట మంచి క్రేజ్ దక్కించుకుంది అవికా గోర్. ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా హిట్ కావడంతో వెంటనే ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా 'లక్ష్మీ రావే మా ఇంటికి' 'సినిమా చూపిస్తా మావ' 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడా' లాంటి హిట్ సినిమాల్లో నటించింది. అయితే అప్పుడు బాగా లావుగా కనిపించి మరో షాకిచ్చింది.

ఆ వెంటనే 'అవికా లావుగా తయారయ్యిందే' అనే కామెంట్స్ వినిపించడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఏం వర్కౌట్స్ చేసిందో కానీ చాలా సన్నబడి 'రాజుగారి గది' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ సాధించింది. అవికా ఈ చిత్రం ప్రమోషన్స్ టైంలోనే గ్లామర్ పాత్రలకు కూడా రెడీ అనే హింట్ ఇచ్చింది. తాజాగా ఈ కుర్రభామ అసలు ఇలా ఎలా మారిపోయారు? అనే ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. "నా బద్ధకం వల్లనే నేను లావుగా తయారయ్యాను. ఒక ఫంక్షన్ కి వెళ్తే నన్ను కొందరు బొండంలా ఉన్నావని హేళన చేసారు. వారి మాటలకు కోపమొచ్చి స్లిమ్ గా మారాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అయితే నేను స్లిమ్ గా మారడానికి క్రెడిట్ మొత్తం నా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీకే చెందుతుంది.

మానసికంగా.. శారీరకంగా నాలో ఈ మార్పుకు కారణం మిలింద్. మేం ఇద్దరం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నాం. రెండేళ్లుగా ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం. ప్రస్తుతం బరువు తగ్గి స్లిమ్ గా మారే సరికి నన్ను ట్రోల్ చేసిన వాళ్లకు సరైన సమాధానం ఇచ్చానని భావిస్తున్నా" అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అవికా నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమాలో నటిస్తుంది. అలాగే ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఆమరన్ సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు నవీన్ చంద్ర - కళ్యాణ్ దేవ్ సినిమాలో ఓకే అయింది. ఇదివరకు ఉయ్యాలా జంపాల లాంటి ఆఫర్స్ మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు నాకు చాలా ఎక్సయిటింగ్ రోల్స్ వస్తున్నాయంటూ మురిసిపోతుంది బ్యూటీ.