Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ త‌మ్ముడికి న‌టులు కావ‌లెను

By:  Tupaki Desk   |   17 Feb 2022 12:30 PM GMT
రౌడీ స్టార్ త‌మ్ముడికి న‌టులు కావ‌లెను
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా ఇప్ప‌డిప్పుడే నిల‌దొక్కుకుంటున్నాడు. `దొర‌సాని` సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే అత‌నికి స‌క్సెస్ ని మాత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` అందించింది. `పుష్ప‌క విమానం`తో హీరోగా మంచి మార్కులు కొట్టేసిన ఆనంద్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం రెట్టించిన ఉత్సాహంతో వ‌రుస‌గా మూడు చిత్రాల్లో న‌టిస్తున్నారు. తాజాగా మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

`గం. గం.. గ‌ణేశా` అనే విభిన్న‌మైన టైటిల్ తో రూపొంద‌నున్న ఈమూవీ త్వ‌ర‌లో సెట్స్ పైకి రానుంది. ఉద‌య్ శెట్టి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. హై లైఫ్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై కేదార్ సెల‌గంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొంద‌నున్న మూవీ కోసం ప్ర‌తిభావంతులైన కొత్త న‌టీన‌టుల‌కు ఆహ్వానం ప‌లుకుతూ చిత్ర బృందం ఆడిష‌న్స్ ని నిర్వ‌హించ‌బోతున్న‌ట్టుగా గురువారం ఓ ప్ర‌క‌టన‌ని విడుద‌ల చేసింది.

25 నుంచి 55 ఏళ్ల వ‌ర‌కు వివిధ పాత్ర‌ల కోసం న‌టులు, 18 - 20 ఏళ్ల ఓ పాత్ర‌కు సంబంధించిన న‌టికి ఆడ‌ష‌న్ ని నిర్వ‌హిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఆస‌క్తి వున్న వారు Audition.gamgamganesha@gmail.com కు త‌మ ఫొటోలు, సంబంధిత వివ‌రాల్ని పంపించుకోవ‌చ్చు. అయితే ఫిల్ట‌ర్ ఫొటోస్‌.. టాక్ టాక్ వీడియోస్ పంప‌వ‌ద్ద‌ని, ఫోన్ కాల్స్ చేయ‌రాద‌ని టీమ్ ఈ సంద‌ర్భంగా తెలిపింది.

ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న `గం.గం.. గ‌ణేశా` చిత్రాన్ని ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభించారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ కోసం కొత్త న‌టీన‌టుల‌ని ఎంపిక చేయ‌డం కోసం కాస్టింగ్ కాల్ ని నిర్వ‌హిస్తున్నారు. ఈ ప్ర‌క్రియ పూర్త‌యిన వెంట‌నే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ మూవీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నుంది.