Begin typing your search above and press return to search.
రాయల్ ఆల్బర్ట్ హాల్.. గొప్పే కానీ ఒక్కటి కొరవ!
By: Tupaki Desk | 22 Oct 2019 11:23 AM GMTఈమధ్య 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాను లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా లైవ్ పెర్ఫామెన్స్ తో స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈ ఘనత అందుకున్న తొలి నాన్ - ఇంగ్లీష్ ఫిలిం 'బాహుబలి' మాత్రమే. భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినిప్రేమికులందరికీ ఇది సంతోషాన్నిచ్చే విషయం. ఈ స్క్రీనింగుకు 'బాహుబలి' టీమ్ సభ్యులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే ఈ స్క్రీనింగ్ గురించి తెలుగు సినీ అభిమానులు కొందరు నిరాశకు గురయ్యారు. కారణం ఏంటంటే రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించినది 'బాహుబలి: ది బిగినింగ్' హిందీ వెర్షన్. దీంతో అక్కడ స్క్రీనింగ్ తెలుగు వెర్షన్ జరుగుతుంది కదా అనుకున్నవారికి షాక్ తగిలింది. సినిమా ఒరిజినల్ వెర్షన్ తెలుగు అయితే డబ్బింగ్ వెర్షన్ ను అక్కడ ప్రదర్శించడం ఏంటని కొందరు తెలుగు సినీ ప్రేమికులు రుసరసలాడుతున్నారు. ఎంతోకాలంగా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే ఒక పొరపాటు అభిప్రాయం ఉంది. దానికి బలాన్ని చేకూర్చేలా రాయల్ ఆల్బర్ట్ హాల్ లో తెలుగు వెర్షన్ కాకుండా హిందీ వెర్షన్ స్క్రీనింగ్ చేయడం చాలామంది తెలుగువారికి నచ్చలేదు.
'బాహుబలి' కారణంగా హిందీ సినిమాకు గౌరవం దక్కిందే కానీ ఇప్పటివరకూ ఏ ఒరిజినల్ హిందీ సినిమా కూడా ఈ ఘనతను సాధించ లేకపోవడం గమనార్హం. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో తెలుగు వెర్షన్ స్క్రీనింగ్ జరిగి ఉంటే ఇంకా బాగుండేది. అయితే హిందీ వెర్షన్ స్క్రీనింగ్ జరగడం 'బాహుబలి' గొప్పతనం పిసరంతైనా తగ్గినట్టు కాదు.