Begin typing your search above and press return to search.
గోల్డెన్ టెంపుల్ ఆశీస్సులు పొందిన 'RRR' త్రయం
By: Tupaki Desk | 21 March 2022 6:30 AM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ లో భాగంగా చరణ్-తారక్-జక్కన్న త్రయం ముఖ్య నగరాలన్నింటిని చుట్టేస్తోన్న సంగతి తెలిసిందే. తొలి ధఫా ప్రచారంలో ఉత్తరాది ఆడియన్స్ ని టార్గెట్ చేసిన త్రయం..మలి ధఫా లో నార్త్..సౌత్ అనే తేడా లేకుండా చుట్టేస్తున్నారు. ఇటీవలే కర్ణాటకలో భారీ ఎత్తున ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి సమక్షంలో భారీ ఎత్తున ప్రీ రిలజీ్ ఈవెంట్ ని నిర్వహించారు. యంగ్ టైగర్ కు ఎన్నటీఆర్ కి కన్నడలో ఉన్న క్రేజ్ ఏంటి? అన్నది మరోసారి రుజువైంది.
ఇక స్పెషల్ ఇంటర్వ్యూలు అంటూ త్రయం ఎవర్నీ విడిచిపెట్టడం లేదు. దొరికిన ప్రతీ వేదికని `ఆర్ ఆర్ ఆర్` ని ప్రచారంతో ఠారెత్తిస్తున్నారు. ఆఫ్ ది వీడియో రికార్డింగ్ క్లిప్పింగ్ ల్ని సైతం నెట్ లోకి వదిలి `ఆర్ ఆర్ ఆర్` పై అంచనాలు పెంచే ప్రయత్నం యూనిక్ గా ఉంది. ఇటీవలే లీకైన అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. చరణ్..తారక్..జక్కన్న మధ్య సరదా సంభాషణ `ఆర్ ఆర్ ఆర్` కి కోట్ల రూపాయల పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.
తాజాగా జక్కన్న-చరణ్-తారక్ త్రయం అమృత్ సర్ లోని డివైన్ గోల్డెన్ టెంటల్ ని సందర్శించారు. అక్కడ అందమైన ఆహ్లాదరకమైన వాతావరణం..పెద్ద సరస్సు మధ్యలో వెలసిన గుడి ఎంతో వైవిథ్యంగా ఉంది. సరిగ్గా అక్కడ నుంచి కొంత దూరంలో చరణ్-తారక్-రాజమౌళి తెలుపు వస్ర్తాలు ధరించి..తలకి తెల్లటి కర్చీప్ లు కట్టుకుని దేవుడికి నమస్కరిస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ముగ్గురితో పాటు మరో సిక్కు వ్యక్తి కూడా ఉన్నారు. ఈ నలుగురు స్వర్ణ దేవాలయం దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
వాస్తవానికి ఈ సందర్శనకి రావడం తారక్ కి ఇష్టం లేదని ఆప్ ది రికార్డులో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒంట్లో నలతగా ఉండటంతో చరణ్ -రాజమౌళి వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చేయాల్సిందిగా అభ్యర్ధించాడు. కానీ చరణ్-జక్కన్న అందుకు ఒప్పుకోలేదు. అంగీకరించి ఉంటే గనుక స్వర్ణ దేవాలయం దేవుడి ఆశీస్సులు తారక్ కోల్పేయేవారు.
ముందుగా `ఆర్ఆర్ఆర్` టీమ్ కర్ణాటక నుండి ఆదివారం గుజరాత్ లో అడుగుపెట్టింది. అప్పుటి నుంచి ఈ క్రేజీ ట్రయో ల్యాండైన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. `ఆర్ఆర్ఆర్` స్టిక్కర్స్ తో పలు కార్లను రోడ్ షో నిమిత్తం గుజరాత్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా గుజరాత్ లోనూ చిత్ర యూనిట్ ప్రమోషన్ అదరగొట్టింది. అక్కడ నుంచి నేరుగా స్వర్ణ దేవాలయానికి చేరుకున్నారు.