Begin typing your search above and press return to search.
ఒకటే ఫార్ములా.. అక్కడ ఫ్లాప్..ఇక్కడ హిట్!
By: Tupaki Desk | 27 Oct 2022 3:30 AM GMTఒక ఫార్ములా ఒక దగ్గర హిట్ అవ్వొచ్చు.. అదే ఫార్ములా మరో చోట ఫ్లాప్ కావచ్చు అని ఈ దీపావళికి విడుదలైన రెండు సినిమాలు స్పష్టం చేశాయి. వివరాల్లోకి వెళితే.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఓరి దేవుడా'. తమిళ హిట్ ఫిల్మ్ 'ఓ మై కడవులే' ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో దేవుడిగా నటించారు.
శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ సమర్పణలో పీవీపీ సినిమా బ్యానర్ పై పీవీపీ నిర్మించారు. తమిళ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ కావడంతో తెలుగు రీమేక్ కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని అంతా భావించారు. ఫాంటసీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో దీపావళి రోజున విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. తమిళ సినిమాని ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసిన దర్శకుడు వెంకీ పాత్రతో కొంత మ్యాజిక్ చేశాడు.
అదే తెలుగులో ఈ రీమేక్ కు మరింత ప్లస్ గా మారి విజయాన్ని అందించింది. సినిమాకు ముందు నుంచి హైప్ లేకపోయినా.. ఎప్పుడైతే విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో దేవుడిగా నటిస్తున్నాడని వీడియో రిలీజ్ చేశారో అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల ఫోకస్ మొదలైంది. ఆశించిన స్థాయిలో సినిమా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఇదే తరహాలో దేవుడు, మనిషి మధ్య సాగే కథ నేపథ్యంలో హిందీ మూవీ 'థాంక్ గాడ్' రూపొందింది.
అజయ్ దేవ్ గన్ చిత్ర గుప్తుడిగా, సిద్ధార్ద్ మల్హోత్రా హీరోగా నటించాడు. బాలీవుడ్ లో రూపొందిన ఈ మూవీని ఇంద్రకుమార్ తెరకెక్కించారు. ధనవంతుడైన ఓ యువకుడు నోట్ల రద్దు కారణంగా తన ఆస్తి మొత్తాన్ని కోల్పోతాడు.
ఆ తరువాత అతని జీవితం అత్యంత దయనీయంగా మారుతుంది. ఈ క్రమంలో వృత్తి పరంగా, వ్యక్తిగతంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు. ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి యమ లోకాని వెళతాడు.
అక్కడ చిత్రగుప్తుడు ఆ యువకుడు చేసి తప్పులని ఎత్తిచూపి తనని తాను మార్చుకునే అవకాశం ఇస్తాడు. ఈ నేఫథ్యంలో అతనితో గైమ్ ఆఫ్ లైఫ్' అనే గేమ్ ని మొదలు పెడతాడు. ఆ తరువాత ఏం జరిగిందన్నపదే ఈ చిత్ర ప్రధాన కథ. 'ఓరి దేవుడా'కు దగ్గరి పోలికలున్నా ట్రీట్‌మెంట్ విధానంలో చాలా మార్పలున్నాయి. ఓరి దేవుడాలో ప్రతీ సీన్ భావోద్వేగభరితంగా, నవ్వులు పూయిస్తూ సాగితే 'థాంక్ గాడ్'లో మాత్రం ఏ ఒక్క సీన్ కూడా నేచురల్ గా లేకపోగా కృత్రిమంగా కనిపిస్తూ ప్రేక్షకుడిని ఎట్రాక్ట్ చేయడంలో విఫలమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.